Share News

Woman Funny Video: పార్టీలో మహిళ కక్కుర్తి.. చికెన్ లెగ్‌ పీస్‌కు టిష్యూ పేపర్ చుట్టి మరీ..

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:41 PM

ఓ పార్టీలో చాలా మంది అతిథులు బిర్యానీ తింటున్నారు. ఇందులో అవాక్కడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. బిర్యానీ తినడంలో అవాక్కవడానికి ఏమీ లేదు గానీ.. బిర్యానీ తినడం అయిపోయాక, ఆమె చేసిన పని అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది..

Woman Funny Video: పార్టీలో మహిళ కక్కుర్తి.. చికెన్ లెగ్‌ పీస్‌కు టిష్యూ పేపర్ చుట్టి మరీ..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని వినోదాన్ని అందిస్తుంటాయి. మరికొన్ని వీడియోలైతే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పార్టీలో చికెన్ బిర్యానీ లాగించేసింది. అయితే చివరలో ఆమె చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ఇదెక్కడి కక్కుర్తిరా బాబోయ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పార్టీలో చాలా మంది అతిథులు (Guests eating biryani) బిర్యానీ తింటున్నారు. ఇందులో అవాక్కడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. బిర్యానీ తినడంలో అవాక్కవడానికి ఏమీ లేదు గానీ.. బిర్యానీ తినడం అయిపోయాక, ఆమె చేసిన పని అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది.


తోటి వారితో కలిసి బిర్యానీ తిన్న ఆమె.. చివరగా లెగ్ పీస్ మిగలడంతో దాని తినలేకపోయింది. అయితే చూస్తూ చూస్తూ దాన్ని పడేయడం ఇష్టం లేక.. (Woman hiding leg piece in purse) దానికి టిష్యూ పేపర్ చుట్టేసి పర్స్‌లో పెట్టేసింది. ఆ తర్వాత అందరితో పాటూ హుందాగా వ్యవహరిస్తూ.. చేతులు శుభ్రం చేసుకుని వెళ్లిపోయింది. చూసేందుకు డబ్బున్న వారిలా కనిపిస్తున్న ఆమె.. ఇలా చికెన్ లెగ్‌ పీస్‌ను పర్సులో దాచుకోవడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


ఈమెను గమనించిన కొందరు, వీడియో తీసి సోల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె కక్కుర్తి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పిల్లల కోసం పార్సిల్ తీసుకెళ్తుందేమో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 85 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అంబానీ టాయిలెట్‌ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 04:41 PM