Watch Viral Video: అక్కడ హార్డ్.. ఇక్కడ స్మార్ట్.. ఇతడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:37 PM
ఇద్దరు వ్యక్తులు ఇసుకను బస్తాల్లో నింపే పనులు చేస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి అందరి మాదిరే ఇనుప పారతో ఇసుక తీసుకుని బకెట్‌లో వేసుకున్నాడు. ఆ తర్వాత బకెట్‌లోని ఇసుకను సంచుల్లో పోస్తున్నాడు. అయితే..
కొందరు కష్టపడి పని చేస్తుంటే.. మరికొందరు ఇష్టపడి పని చేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం అదే పనిని టెక్నిక్‌తో ఆడుతూపాడుతూ చేసేస్తుంటారు. ఇలాంటి వారి తెలివిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు ఇసుక ఎత్తే పని చేస్తుంటారు. అయితే వారిలో ఓ వ్యక్తి చేసే పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఇసుకను బస్తాల్లో (Young men filling bags with sand) నింపే పనులు చేస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి అందరి మాదిరే ఇనుప పారతో ఇసుక తీసుకుని బకెట్‌లో వేసుకున్నాడు. ఆ తర్వాత బకెట్‌లోని ఇసుకను సంచుల్లో పోస్తున్నాడు. అయితే అక్కడే ఉన్న మరో యువకుడు మాత్రం.. ఇదే పనిని ఎంతో తెలివిగా చేశాడు.
సంచిలో ఇసుక నింపడానికంటే ముందు ఓ పెద్ద ప్లాస్టిక్ పైపును (Plastic pipe in bag) సంచిలో సెట్ చేశాడు. తర్వాత ఆ సంచితో పాటూ పైపును ఒకేసారి ఇసుకను నింపేస్తాడు. ఆ తర్వాత సంచిలోని పైపును బయటికి లాగేడంతో బస్తా ఇసుక రెడీ అయిపోతుందన్నమాట. ఇలా డబుల్ డబుల్ కాకుండా ఒకేసారి ఇసుకను బ్యాగుల్లోకి నింపేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇకరిది హార్డ్ వర్క్.. ఇంకొకరికి స్మార్ట్ వర్క్’.. అంటూ కొందరు, ‘వావ్.. ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 88వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి