Share News

Train Viral Video: రెండు బోగీల మధ్య ఇంత సందేశం ఉందా.. ఈ వీడియోలో తేడా ఏముందో మీరే చూడండి..

ABN , Publish Date - Sep 18 , 2025 | 03:29 PM

ఓ రైలు స్టేషన్‌లోకి వచ్చి ఆగుతుంది. దీంతో ప్రయాణికులు మొత్తం రైలు ఎక్కేందుకు పరుగులు పెడతారు. రైల్లో చాలా బోగీలు ఉన్నా కూడా.. ప్రయాణికులంతా జనరల్ బోగీ ఎక్కేందుకు పోటీపడుతున్నారు. దీంతో..

Train Viral Video: రెండు బోగీల మధ్య ఇంత సందేశం ఉందా.. ఈ వీడియోలో తేడా ఏముందో మీరే చూడండి..

కొన్ని దృశ్యాలు మనసులను కదిలిస్తే.. మరికొన్ని దృశ్యాలు మనుషుల మధ్య అంతరాలను ప్రతిబింబిస్తుంటాయి. అలాగే ఇంకొన్ని దృశ్యాలు ధనిక, పేదల జీవన స్థితిగతులను తెలియజేస్తుంటాయి. ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. రెండు బోగీలకు సంబంధించిన ఆ వీడియోలో తేడా ఏంటీ మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైలు స్టేషన్‌లోకి వచ్చి ఆగుతుంది. దీంతో ప్రయాణికులు మొత్తం రైలు ఎక్కేందుకు పరుగులు పెడతారు. ఇందులో ఆలోచింపజేయడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. రైల్లో చాలా బోగీలు ఉన్నా కూడా.. ప్రయాణికులంతా జనరల్ బోగీ (General Bogie) ఎక్కేందుకు పోటీపడుతున్నారు. దీంతో ఆ బోగీ మొత్తం జనాలతో కిక్కిరిపోయింది.


అయినా చాలా మంది జనరల్ బోగీ డోరు వద్ద వేలాడుతూ, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దాని పక్కనే ఉన్న ఏసీ బోగీ (AC bogie) మాత్రం ఖాళీగా కనిపించింది. రెండు బోగీలు పక్క పక్కనే ఉన్నా.. ప్రయాణికుల రద్దీలో మాత్రం ఎంతో వ్యత్సాసం కనిపించింది. ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎక్కువ శాతం మంది పేదలుగా మిగిలిపోతున్నారనే దానికి ఈ దృశ్యం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఏసీ బోగీలో ప్రయాణించే స్థోమత లేకపోవడంతో ఎక్కువ శాతం కష్టమైనా జనరల్ బోగీలో వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్నారు.


వీడియో తీస్తున్న వ్యక్తి ఇదే విషయాన్ని వివరిస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మన దేశంలో పేదల జీవితాల్లో మార్పు రాలేదు.. రాదు’.. అంటూ కొందరు, ‘60% కంటే ఎక్కువ మంది.. రోజుకు రూ.100కూడా సంపాదించడం లేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2500కి పైగా లైక్‌లు, 60 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అంబానీ టాయిలెట్‌ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 03:30 PM