Share News

Deers VS Wild Dogs: చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..

ABN , Publish Date - Sep 18 , 2025 | 07:10 PM

కొన్ని అడవి కుక్కలు ఆహారం కోసం అటూ, ఇటూ వెతుకుతుండగా.. వాటికి కొన్ని జింకలు కనిపిస్తాయి. వాటిని చూడగానే ఈ పూట కడుపు నిండిపోయిందని సంబరపడుతూ దాడి చేయడానికి వెళ్లాయి. అయితే..

Deers VS Wild Dogs: చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..

అడవుల్లో జంతువుల మధ్య నిత్యం చావుబతుకుల పోరాటం జరుగుతుంటుంది. పులులు, సింహాలు, తోడేళ్లు, హైనాలు, అడవి కుక్కలు వంటి జంతువులు మిగతా జంతువులను వేటాడుతుంటాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో గేదెలు, జిరాఫీలు, జింకలు వంటి జంతువులు చేసే ప్రయత్నాలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవి కుక్కల నుంచి తప్పించుకోవడానికి జింకలు వేసిన మాస్టర్ ప్లాన్ చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని అడవి కుక్కలు ఆహారం కోసం అటూ, ఇటూ వెతుకుతుండగా.. వాటికి కొన్ని జింకలు కనిపిస్తాయి. వాటిని చూడగానే ఈ పూట కడుపు నిండిపోయిందని సంబరపడుతూ (Wild dogs tried to hunt deers) దాడి చేయడానికి వెళ్లాయి. అయితే అడవి కుక్కలను చూడగానే జింకలన్నీ అలెర్ట్ అయ్యాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో వాటికి ఓ బంపర్ ఐడియా వస్తుంది. వెంటనే సమీపంలోని పెద్ద బండరాయి పైకి ఎక్కేశాయి.


బండ రాయి మధ్యలో నిలబడిన జింకలు (Deer standing on large rock) కదలకుండా ఉండగిపోయాయి. వాటిని వేటాడేందుకు బండరాయి పైకి ఎక్కిన కుక్కలు.. సమీపానికి వెళ్తే జారి కిందపడే ప్రమాదం ఉంది. దీంతో ఆ కుక్కలు రాయి పైనే నిలబడి నిరాశగా చూస్తుండిపోయాయి. మధ్య మధ్యలో కొన్ని కుక్కలు ఎలాగైనా వాటిని వేటాడాలని చూసినా సాధ్యం కాలేదు. ఇలా ఆ కుక్కలన్నీ కలిసి చాలా సేపు జింకలను వేటాడేందుకు ఎంతో ప్రయత్నించాయి. అయితే చివరకు అది సాధ్యం కాక.. నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ జింకల తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘అడవి కుక్కలకు గట్టి షాకే ఇచ్చాయిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57 వేలకు పైగా లైక్‌లు, 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అంబానీ టాయిలెట్‌ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 07:24 PM