Share News

Optical illusion: మీ పరిశీలనా శక్తికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో తప్పు ఏంటో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Sep 23 , 2025 | 09:48 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పాప వర్షంలో తన పెంపుడు కుక్కతో నడుస్తూ వెళ్తోంది. ఆమె వెనుక వృక్షాలు, ఇల్లు కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ తప్పు దాగి ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం..

Optical illusion: మీ పరిశీలనా శక్తికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో తప్పు ఏంటో కనుక్కోండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు అనేకం చూస్తుంటాం. అయితే వీటిలో కొన్ని చిత్రాలు మన కంటికి, మెదడుకు పెద్ద పరీక్షగా మారుతుంటాయి. పైకి సాధారణంగానే అనిపించినా, ఎంతకీ అందులోని దాగి ఉన్న పజిల్స్‌కు సమాధానాలు కనిపించవు. అయితే కాస్తంత నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఇట్టే కనుక్కోవచ్చు. తాజాగా, ఇలాంటి ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీ మందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో తప్పు ఏంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పాప వర్షంలో తన పెంపుడు కుక్కతో నడుస్తూ వెళ్తోంది.


ఆ పాప వెనుక చాలా వృక్షాలు కనిపిస్తాయి. అలాగే వాటి వెనుక ఓ ఇంటిని కూడా చూడొచ్చు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో అంతా (Hidden mistake in picture) బాగున్నా కూడా ఓ తప్పు దాగి ఉంది.


ఆ తప్పు ఎంటో కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తప్పేంటో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి.


ఒకవేళ ఇప్పటికీ ఆ తప్పును కనుక్కోలేకుంటే మాత్రం ఈ కింద ఉన్న చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illlusion-viral.jpg


ఈ చిత్రంలో తాబేలు చెట్టు మీద కనిపిస్తుంది. నీటిలో ఉండాల్సిన తాబేలు చెట్టు మీద ఉండడమే ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పు. ఈ తప్పును ముందే గుర్తించిన వారంతా ఎంతో తీక్షణమైన చూపు కలవారని అర్థం.


ఇవి కూడా చదవండి..

ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Sep 23 , 2025 | 09:48 PM