Biker Funny Video: ఈ టైరుకు లైఫ్‌టైమ్ వారెంటీ ఇవ్వొచ్చేమో.. ఎలా సెట్ చేశాడో చూస్తే..
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:15 PM
ఓ వ్యక్తి బైకు టైర్ పంక్చర్ సమస్యతో విసిగిపోయాడో ఏమో గానీ.. అసలు పంక్చర్ కాకుండానే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించిన అతడికి ఓ ఐడియా తట్టింది..
బైకు డ్రైవింగ్ ఎంత సరదాగా ఉంటుందో.. పంక్చర్ అయినప్పుడు అంతే చిరాకుగా ఉంటుంది. బైకులను తోసుకుంటూ వెళ్లాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. అయితే ప్రస్తుతం ట్యూబ్ లెస్ టైర్ల రాకతో ఆ సమస్య కొంత తగ్గిందనే చెప్పొచ్చు. పంక్చర్ అయినా చాలా దూరం వరకూ బైకును నడుపుకొంటూ వెళ్లొచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. బైక్ టైరుకు పంక్చర్ అనేదే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి వినూత్న ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకు టైర్ పంక్చర్ సమస్యతో విసిగిపోయాడో ఏమో గానీ.. అసలు పంక్చర్ కాకుండానే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించిన అతడికి ఓ ఐడియా తట్టింది. ఐడియా రావడమే ఆలస్యం.. బైకు టైరు ఊడదీసి తన ప్రయోగాన్ని అమలు చేశాడు.
ముందుగా టైరు మధ్యలో ఓ రంధ్రం చేశాడు. తర్వాత అందులో అప్పటికే కలిపి (Cement And Gravel Mixture Poured into Tire) పెట్టుకున్న సిమెంట్, కంకర మిశ్రమాన్ని చొప్పించాడు. టైరు రంధ్రంలో సిమెంట్, కంకర మిశ్రమాన్ని పోసి.. కర్రతో లోపలికి నెడుతున్నాడు. ఇలా చాలా సేపు శ్రమించి ఆ టైరు మొత్తం సిమెంట్, కంకరను నింపేశాడు. లోపల అది గట్టిపడి కాంక్రీట్‌గా మారితే.. అసలు పంక్చర్లే కావనేది అతడి ఉద్దేశం.
ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 88వేలకు పైగా లైక్‌లు, 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి