Snake And Rat Funny Video: ఎదురుగా ఉన్న ఎలుక.. పదే పదే కాటేస్తున్న పాము.. ట్విస్ట్ ఏంటో చూస్తే..
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:25 PM
పాము కాటుకు గురయ్యే ఎలుకలు ప్రాణాలు కోల్పోవడం తప్పదు. అయితే కొన్నిసార్లు అవి అదృష్టవశాత్తు త్రుటిలో పాము కాటు నుంచి తప్పించుకుంటుంటాయి. కొన్నిసార్లు ఎలుక, పాము మధ్య తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..
ఎలుక, పాముకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాము కాటుకు గురయ్యే ఎలుకలు ప్రాణాలు కోల్పోవడం తప్పదు. అయితే కొన్నిసార్లు అవి అదృష్టవశాత్తు త్రుటిలో పాము కాటు నుంచి తప్పించుకుంటుంటాయి. కొన్నిసార్లు ఎలుక, పాము మధ్య తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎదురుగా ఉన్న ఎలుకను ఓ పాము పదే పదే కాటేసింది. చివరకు తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ ఎలుక బోనులో (Rat in Cage) చిక్కుకుని ఉంది. అంతలో అటుగా వచ్చిన పాము.. ఎలుకను చూసి సమీపానికి వెళ్లింది. ఎలుక బోనులో ఉన్న విషయం దానికి అర్థం కాదు కాబట్టి.. ఎలుకను టార్గెట్ చేసుకుని కాటేసింది. అయితే ఇనుప ఊచలు ఉండడంతో దాని కాటు ఎలుకను తాకదు.
అయినా పాము పదే పదే ఎలుకను కాటేయడానికి ప్రయత్నిస్తుంది. పాము కాటేసిన ప్రతీసారీ (Snake Tried to bite Rat in Cage) లోపల ఉన్న ఎలుక ఎంతో తెలివిగా తప్పించుకుంటూ ఉంటుంది. మధ్యలో మధ్యలో పాముకు దండం పెట్టి వేడుకున్నట్లుగా.. ఎలుక తన ముందు కాళ్లను పైకి లేపి, కలిపి పట్టుకుని పాముకు నమస్కరిస్తున్నట్లుగా ఉంటుంది. ‘పామన్నా.. పామన్నా.. నీకు దండం పెడతా.. నన్ను వదిలేయ్..’.. అన్నట్లుగా ఎలుక భయపడుతూ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.
ఇలా ఆ పాము ఎన్నిసార్లు కాటేయడానికి ప్రయత్నించినా ఎలుకకు ఏమీ కాదన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ట్రాప్‌లో పడడమే ఈ ఎలుక అదృష్టమైంది’.. అంటూ కొందరు, ‘మిషన్ ఇంపాజిబుల్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి