Woman Funny Video: ప్లేటులో రెండు పానీపూరీలు తగ్గాయని మహిళ ఆగ్రహం.. చివరకు ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:26 PM
ఓ మహిళ పానీపూరీ తినేందుకు వెళ్లింది. ప్లేటు పూరీ ఆర్డర్ చేయడంతో.. కాసేపటికి ఆమె చేతిలోకి పానీపూరీల ప్లేటు వచ్చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది..
పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. పట్టణాలు, నగరాల్లో పానీపూరీ తినని యువతీయువకులు ఉండరంటే అతిశయోక్తికాదు. కొందరు వాటి కోసం ఎంతదూరం వెళ్లడానికైనా వెనుకాడరు. మరికొందరైతే పానీపూరీ అంటేనే పడి చచ్చిపోతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ తన ప్లేటులో రెండు పానీపూరీలు తక్కువగా వచ్చాయని రచ్చరచ్చ చేసింది. దీంతో ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నగరంలోని సుర్సాగర్ సరస్సు ప్రాంతం సమీపంలో పానీపూరీ తినేందుకు వెళ్లింది. ప్లేటు పూరీ ఆర్డర్ చేయడంతో.. కాసేపటికి ఆమె చేతిలోకి పానీపూరీల ప్లేటు (Pani Puri Plate) వచ్చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. పానీపూరీల ప్లేటు వచ్చింది గానీ.. అందులో రెండు పూరీలు తగ్గాయి.
రూ.20లకు 6 పూరీలు రావాల్సి ఉండగా.. 4 మాత్రమే ఉన్నాయి. దీంతో ఆమెకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. అసలే పానీపూరీలంటే పడి చచ్చే ఆమె.. ఇలా తన ప్లేటులో రెండు పూరీలు తక్కువ ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయింది. వెంటనే పానీపూరీ బండి యజమానితో గొడవ పెట్టుకుంది. చివరకు ఆ గొడవ కాస్తా ధర్నా వరకూ వెళ్లింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ రోడ్డు మధ్యలో (Woman protesting for Panipuri) కూర్చుని ఆందోళన చేసింది. దీంతో ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. పోలీసులతో ఆమె ఏడుస్తూ తనకు రెండు పూరీలు తక్కువ వచ్చాయని, ఎలాగైనా 6 పూరీలు కావాల్సిందే అంటూ పట్టుబట్టింది.
మహిళతో మాట్లాడిన పోలీసులు.. చివరకు ఎలాగోలా శాంతింపజేశారు. ఇదిలాఉండగా, ఇంత రచ్చ చేసిన ఆమెకు.. చివరకు ఆ రెండు పూరీలు అందాయా, లేదా అనే విషయం తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమెకు చాలా పెద్ద అన్యాయం జరిగింది’.. అంటూ కొందరు, ‘ఆమె పూరీలు ఆమెకు దక్కడం న్యాయం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి