Lion funny video: క్యాబేజీ టేస్ట్ చేసిన సింహం.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Sep 18 , 2025 | 09:23 PM
బోనులో ఉన్న ఓ సింహం.. అటు , ఇటూ నడుస్తుంటుంది. దాన్ని చూడటానికి వచ్చిన ప్రయాణికులు.. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను బోను లోపలికి విసిరేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సింహం అంటేనే కళ్లు చెదిరే వేగం, వెంటాడి వెంటాడి వేటాడే సీన్లు గుర్తుకొస్తుంటాయి. రాజసానికి మారుపేరుగా పిలుచుకునే సింహాలు.. అప్పుడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం క్యాబేజీని టేస్ట్ చేసింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బోనులో ఉన్న ఓ సింహం.. అటు , ఇటూ నడుస్తుంటుంది. దాన్ని చూడటానికి వచ్చిన ప్రయాణికులు.. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను బోను లోపలికి విసిరేశారు. వారిలో ఒకరు క్యాబేజీని కూడా విసిరేశారు.
క్యాబేజీని చూసిన సింహం.. సమీపానికి వెళ్లి కాలితో దాన్ని అటూ, ఇటూ తిప్పి చూస్తుంది. తర్వాత నోటిలోకి తీసుకుని, (lion tasted cabbage) కొరికే ప్రయత్నం చేస్తుంది. మాంసం అనుకుని కొరికిన సింహం.. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కవుతుంది. నోరు తెరచి వింత వింత ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. మాంసం వేయకుండా నన్ను ఫూల్ చేస్తున్నారే.. అన్నట్లుగా నోరు తెరుస్తుంది. సింహం వింత ఎక్స్‌ప్రెషన్ చూసి అంతా అవాక్కవుతున్నారు.
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సింహం ఎక్స్‌ప్రెషన్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘వెజిటేరియన్ తినాల్సి వచ్చినప్పుడు అందరిదీ ఇదే ఎక్స్‌ప్రెషన్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 5. 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి