Bike Puncture Scam: హైవేపై వింత స్కామ్.. టైరులో గాలి తక్కువగా ఉందని చెప్పి.. చివరకు..
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:04 PM
కొందరు దొంగలు తెలివిగా చోరీలు చేయడం చూశాం. ఇంకొందరు రోడ్డుపై రాళ్లు అడ్డుగా పెట్టి వాహనదారులను దోచుకోవడం చూశాం. అలాగే లిఫ్ట్ పేరుతో వాహనాలు ఎక్కి.. చివరకు కత్తులు, తుపాకీలతో బెదిరించి నగలు, నగదును లాక్కోవడం కూడా చూశాం. అయితే తాజాగా, ఓ షాకింగ్ స్కామ్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది..
కొత్త ఏరియాల్లో ప్రయాణించే సమయాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మొత్తం లూటీ చేసేస్తారు. కొందరు దొంగలు తెలివిగా చోరీలు చేయడం చూశాం. ఇంకొందరు రోడ్డుపై రాళ్లు అడ్డుగా పెట్టి వాహనదారులను దోచుకోవడం చూశాం. అలాగే లిఫ్ట్ పేరుతో వాహనాలు ఎక్కి.. చివరకు కత్తులు, తుపాకీలతో బెదిరించి నగలు, నగదును లాక్కోవడం కూడా చూశాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వింత స్కామ్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ స్కామ్ గురించి తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియోలో తెలిపిన సారాంశాన్ని బట్టి.. ముంబై - పూణే హైవేపై (Mumbai - Pune Highway) కొత్త రకం స్కామ్ (Puncture Scam) జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైవేపై వెళ్లే వాహనదారులను కొందరు టార్గెట్ చేసుకుంటారు. బైకులు, కార్లలో వెళ్లే వారికి సమీపానికి వెళ్లి.. ‘సార్.. మీ వాహనం టైరులో గాలి తక్కువగా ఉందండీ.. వెళ్లి పంక్షర్ షాపులో చెక్ చేయించుకోండి’.. అని చెబుతారు. దీంతో సదరు వాహనదారుడు భయపడి సమీపంలోని పంక్షర్ షాపులోకి వెళ్లి గాలి చెక్ చేయిస్తాడు.
పంక్షర్ షాపులో ఉన్న వారు గాలి తక్కువగా ఉన్నట్లు చూపించి, టైర్ పంక్షర్ (Tire puncture) వేయాలని చెబుతారు. ఈ క్రమంలో ఇనుప కడ్డీలతో టైరును అనేక చోట్ల పొడిచి పంక్షర్లు చేస్తారు. ఇలా ఒక వాహనదారుడి నుంచి వాహనాన్ని బట్టి కనీసం రూ.1000 వరకూ వసూలు చేస్తారు. ఇటీవల ఇలాంటి మోసాలు పెరిగిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని కళ్లకు కట్టేలా వీడియోలో కూడా జరిగింది. ఓ బైకర్ (Biker) హైవేపై వెళ్తుండగా.. మరో బైకులో వచ్చిన యువతి, ఓ యువకుడు అతడితో మాట్లాడారు.
టైరులో గాలి తక్కువగా ఉందని అతడికి చెబుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయింది. ముందుగా బైకును ఆపి చెక్ చేసుకున్న అతను.. ఆ తర్వాత ఎవరి మాట పట్టించుకోకుండా నేరుగా వెళ్లిపోతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో. ఇదెక్కడి స్కామ్‌రా నాయనా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి మోసాలు ఇటీవల పెరిగిపోయాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 65 వేలకు పైగా లైక్‌లు, 6.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి