Snake Bite Video: పాములు పట్టడంలో చేసిన చిన్న తప్పు.. ఈ కానిస్టేబుల్ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:58 PM
సంతోషం అనే వ్యక్తి 17 ఏళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడు పోలీసు విధులతో పాటూ పాములు పట్టే పని కూడా చేస్తుంటాడు. అయితే ఇటీవల పాములు పట్టే క్రమంలో అతడు చేసిన చిన్న నిర్లక్ష్యం చివరకు ఎలా ప్రాణాలు తీసిందో చూడండి.
అజాగ్రత్త, మితిమీరిన ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు ప్రాణాలు తీసే వరకూ వెళ్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యం చివరకు అతడి ప్రాణాలను తీసింది. పాము పట్టుకునే సమయంలో ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోషం అనే వ్యక్తి .. మధ్యప్రదేశ్ పోలీస్ 1వ బెటాలియన్‌లో 17 ఏళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడు పోలీసు విధులతో పాటూ పాములు పట్టే (Constable catches cobra) పని కూడా చేస్తుంటాడు. జనావాసాల్లో పాములు కనిపిస్తే.. వెంటనే వెళ్లి, వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటాడు.
ఇదిలాఉండగా, ఇటీవల పోలీసు సిబ్బంది విశ్రాంత భవనంలోకి నాగు పాము ప్రవేశించింది. సమాచారం అందుకున్న సంతోష్ వెంటనే అక్కడికి వెళ్లాడు. పాములు పట్టే స్టిక్, తదితరాలు తన వద్ద ఉన్నా కూడా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ పాము నన్నేం చేస్తుందిలే అని అనుకున్నాడే ఏమో గానీ.. పామును ఒట్టి చేతులతో పట్టే ప్రయత్నం చేశాడు. పాము కిటికీ వద్ద ఉండగా.. నేరుగా వెళ్లి చేతుల్లో పట్టేసుకున్నాడు. దీంతో ఆ పాము (Cobra bites constable) అతడి చేతిపై కాటేసింది. అయినా అతను మాత్రం భయపడకుండా పామును తన చేతికి చుట్టుకుని బయటికి తీసుకెళ్లాడు. చుట్టూ ఉన్న వారు పాము కాటేయడాన్ని చూసి భయపడతారు.
కానీ అప్పటికీ అతను డాక్టర్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేయకుండా అక్కడే కాలయాపన చేశాడు. ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. కాగా, సంఘటనలు సంబంధిచంిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘పాములు పట్టే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి