Share News

Dangerous Stairs Video: నరకానికి రహదారి.. ఈ మెట్లు ఎక్కాలంటే గుండె ధైర్యం కావాల్సిందే..

ABN , Publish Date - Sep 23 , 2025 | 04:15 PM

ఓ వ్యక్తి తన ఇంట్లో గండ్రంగా తిరుగుతూ ఎక్కేలా మెట్లు నిర్మించుకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా. మెట్లు గుండ్రంగా నిర్మించడంలో విశేషం ఏమీ లేదు గానీ.. మెట్లను నిర్మించిన విధానమే అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Dangerous Stairs Video: నరకానికి రహదారి.. ఈ మెట్లు ఎక్కాలంటే గుండె ధైర్యం కావాల్సిందే..

కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాగే మరికొందరు చేసే పనులు గుండె గుబేల్‌మనేలా ఉంటాయి. ఇలాంటి చిత్ర విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో నిర్మించిన మెట్లు చూసి అంతా భయపడిపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈ మెట్లు ఎక్కాలంటే గట్స్ ఉండాల్సిందే’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో గండ్రంగా తిరుగుతూ ఎక్కేలా మెట్లు నిర్మించుకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా. మెట్లు గుండ్రంగా నిర్మించడంలో విశేషం ఏమీ లేదు గానీ.. మెట్లను నిర్మించిన విధానమే అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. సాధారణంగా ఎవరైనా మెట్లను చెక్క లేదా కాంక్రీట్‌తో నిర్మిస్తారు. ఇతను మాత్రం ఇనుప కడ్డీలతో నిర్మించాడు. అయితే అసలు సమస్య వచ్చి పడింది.


ఇనుప కడ్డీలతో నిర్మించిన ఆ వ్యక్తి.. మెట్ల మద్యలో మొత్తం ఖాళీ స్థలం (Empty space between stairs) ఉండేలా సెట్ చేశాడు. ఏమాత్రం అజాగ్రత్తగా అడుగు వేసినా నేరుగా వచ్చి కిండపడిపోయే పరిస్థితి. ఎంతో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఆ మెట్లపై నుంచి కిందకు దిగుతూ వీడియో తీశాడు. వీడియోలో చూస్తున్న వారికి కళ్లు తిరిగిలా ఆ మెట్ల నిర్మాణం ఉంది.


అయినా ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా మెట్ల పైనుంచి చకచకా దిగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘వామ్మో.. ఇవి మెట్లా లేక నరకానికి రహదారా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి భయంకరమైన మెట్లను ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..

పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 05:01 PM