Aunt Marries Nephew: మేనల్లుడితో అఫైర్ పెట్టుకుని అతడికే షాక్.. భర్త నిలదీస్తే ఆమె ఏం చేప్పిందంటే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:12 AM
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఒక షాకింగ్ కథ వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన మేనల్లుడితోనే అఫైర్ పెట్టుకుంది. భర్తకు తెలియకుండా మూడేళ్లుగా వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు విషయం మామకు తెలియడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఒక షాకింగ్ కథ వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన మేనల్లుడితోనే అఫైర్ పెట్టుకుంది. భర్తకు తెలియకుండా మూడేళ్లుగా వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు విషయం మామకు తెలియడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. అక్కడ ఆ మహిళ చెప్పిన మాటలు విని అందరూ షాకయ్యారు. చివరకు తనతో అఫైర్ పెట్టుకున్న మేనల్లుడినే బెదిరించింది. పోలీసుల సమక్షంలో వివాహం చేసుకుంది (unusual marriage).
రాంపూర్ జిల్లాకు చెందిన చంచల్ అనే మహిళ వివాహిత. నూర్‌పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని కాపురం చేస్తోంది. అయితే మూడేళ్ల కిందట భర్త మేనల్లుడు బ్రహ్మ స్వరూప్‌తో ప్రేమలో పడింది. మేనత్త కోసం బ్రహ్మ స్వరూప్ రాత్రి సమయంలో గోడ దూకి వెళ్లేవాడు. మూడేళ్లుగా ఈ అఫైర్ కొనసాగుతోంది. చివరకు ఆ విషయం నూర్‌పాల్‌కు తెలిసింది. అతడు పలుసార్లు హెచ్చరించినా చంచల్ మనసు మారలేదు. దీంతో నూర్‌పాల్ పోలీసులను ఆశ్రయించాడు. భార్యపై ఫిర్యాదు చేశాడు (family affair news).
తాను ఇక మేనల్లుడితోటే ఉంటానని, భర్తతో కలిసి ఉండలేనని పోలీసుల సమక్షంలో చంచల్ తేల్చి చెప్పింది. దీంతో అక్కడున్న అందరూ షాకయ్యారు (controversial wedding). పోలీసులు బ్రహ్మ స్వరూప్‌ను స్టేషన్‌కు పిలిచారు. అతడు చంచల్‌ను వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో అతడిపై చంచల్ అత్యాచారం కేసు పెట్టింది. దీంతో దిగివచ్చిన బ్రహ్మ స్వరూప్ పోలీసుల సమక్షంలోనే చంచల్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి..
విపత్తు సమయంలోనూ వ్యాపారం.. అతడు కార్న్ స్టాల్ ఎక్కడ పెట్టాడో చూడండి..
మీది సూపర్ ఫాస్ట్ బ్రెయిన్ అయితే.. ఈ ఫొటోల్లో మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..