Disaster humor: విపత్తు సమయంలోనూ వ్యాపారం.. అతడు కార్న్ స్టాల్ ఎక్కడ పెట్టాడో చూడండి..
ABN , Publish Date - Sep 18 , 2025 | 03:04 PM
అందరూ ఎక్కడ సమస్యను చూస్తారో, అక్కడ అవకాశాన్ని చూసేవారు మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు. అలాంటి నైపుణ్యం చాలా కొద్ది మందికే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
అందరూ ఎక్కడ సమస్యను చూస్తారో, అక్కడ అవకాశాన్ని చూసేవారు మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు. అలాంటి నైపుణ్యం చాలా కొద్ది మందికే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పాకిస్థాన్ వరదలతో (Flood in Pakistan) అతలాకుతలమవుతోంది. ఇళ్లు, దుకాణాలు, భవనాలు కొట్టుకుపోతున్న అనేక వీడియోలు వైరల్ అయ్యాయి (Funny flood video).
నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా నీటితో నిండిపోయిన వాగులను చూసేందుకు జనం గుమిగూడుతున్నారు. పొంగి ప్రవహిస్తున్న వాగులను, నదులను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. సరిగ్గా అలాంటి చోట ఓ వ్యక్తి మొక్కజొన్న స్టాల్‌ను ఏర్పాటు చేశాడు (street vendor flood). వరదను చూసేందుకు వచ్చిన వారికి ఆ మొక్కజొన్నలను అమ్ముతున్నాడు. వరద నీటిని చూస్తూ ప్రజలు మొక్కజొన్న తినడం కనిపిస్తోంది. @ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (clever marketing).
ఈ వైరల్ వీడియోను (corn seller viral) ఇప్పటివరకు దాదాపు 7 లక్షల మంది వీక్షించారు. 68 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ మొక్కజొన్న విక్రేత కొన్ని రోజుల్లోనే లక్షాధికారి అవుతాడని ఒకరు కామెంట్ చేశారు. అక్కడ ఓ టీ స్టాల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదని మరొకరు పేర్కొన్నారు. ఇది మంచి బిజినెస్ ఐడియా అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. ఈ తెలివికి సలాం చెప్పాల్సిందే.. బైక్ టైర్‌లో గాలి ఎలా నింపుతున్నాడో చూడండి..
మీ దృష్టికి పరీక్ష.. ఈ బెడ్రూమ్‌లో సీతాకోకచిలుక ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..