Share News

Desi jugaad: వావ్.. ఈ తెలివికి సలాం చెప్పాల్సిందే.. బైక్ టైర్‌లో గాలి ఎలా నింపుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Sep 16 , 2025 | 03:08 PM

క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలను కనుగొనడంలో భారతీయులను మించిన వారు ఉండరు. మనదేశంలో చాలా మంది సామాన్యులు కూడా అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించి సూపర్ ట్రిక్స్ కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Desi jugaad: వావ్.. ఈ తెలివికి సలాం చెప్పాల్సిందే.. బైక్ టైర్‌లో గాలి ఎలా నింపుతున్నాడో చూడండి..
desi hack video

క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలను కనుగొనడంలో భారతీయులను మించిన వారు ఉండరు. మనదేశంలో చాలా మంది సామాన్యులు కూడా అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించి సూపర్ ట్రిక్స్ కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్ టైర్‌లో గాలిని నింపడానికి అద్భుతమైన ట్రిక్ ఉపయోగించాడు (bike air filling hack).


@I_Am_AmeerAbbas అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బైక్ వెనుక టైర్‌లో గాలి లేదు. దీంతో ఆ వ్యక్తి ఓ రబ్బర్ పైప్‌ను తీసుకొచ్చి ఒక చివరను బైక్ టైర్‌కు అమర్చాడు. మరో చివరను ఆ బైక్ సైలెన్సర్‌కు సెట్ చేశాడు. ఆ తర్వాత బైక్ స్టార్ట్ చేసి ఎక్స్‌లేటర్ ఇచ్చినపుడు ఆ సైలెన్సర్ నుంచి వచ్చే పొగ టైర్‌లోకి వెళ్లి నిండింది. టైర్‌లో తిరిగి గాలి నింపే సౌకర్యం లేని సమయంలో ఈ టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు (Indian life hacks).


ఈ జుగాడ్‌కు సంబంధించిన వీడియో (jugaad ideas) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.78 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది పనికొచ్చే ఆలోచన లాగానే కనబడుతోందని ఒకరు కామెంట్ చేశారు. ఇలా చేయాలంటే ఎప్పుడూ మీ దగ్గర ఓ పైప్ ఉండాలని మరొకరు పేర్కొన్నారు. అద్భుతమైన ట్రిక్ అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

పైలెట్లు పెర్ఫ్యూమ్ ఎందుకు వేసుకోరు.. అసలు కారణమేంటో తెలిస్తే..

ఆరోగ్యం బాగోలేదని బాస్‌కు మెసేజ్.. పది నిమిషాల్లోనే ఎంతో ఘోరం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 16 , 2025 | 03:08 PM