Share News

Pilots perfume rule: పైలెట్లు పెర్ఫ్యూమ్ ఎందుకు వేసుకోరు.. అసలు కారణమేంటో తెలిస్తే..

ABN , Publish Date - Sep 14 , 2025 | 09:25 AM

పైలెట్ ఉద్యోగం చాలా నైపుణ్యంతో కూడుకున్నది. ఆకాశంలో విహారం, కళ్లు చెదిరే జీతం, దేశవిదేశాలు తిరిగే వీలు వంటి ఎన్ని సౌకర్యాలున్నా వారు ఉద్యోగ సమయంలో చాలా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.

Pilots perfume rule: పైలెట్లు పెర్ఫ్యూమ్ ఎందుకు వేసుకోరు.. అసలు కారణమేంటో తెలిస్తే..
pilots perfume rule

పైలెట్ ఉద్యోగం చాలా నైపుణ్యంతో కూడుకున్నది. ఆకాశంలో విహారం, కళ్లు చెదిరే జీతం, దేశవిదేశాలు తిరిగే వీలు వంటి ఎన్ని సౌకర్యాలున్నా వారు ఉద్యోగ సమయంలో చాలా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. విమానయానంలో చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొన్ని నిబంధనలను రూపొందించింది (Aviation safety).


పైలెట్లు డ్యూటీకి వచ్చే ముందు పెర్ఫ్యూమ్ వేసుకోకూడదని డీజీసీఏ సూచిస్తుంది. ఈ నియమం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉందని కెప్టెన్ తోమర్ అవధేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రతి పైలట్ విమానం నడిపే ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవాలి (Breathalyzer test pilots). బ్రీత్‌ అనలైజర్ పరికరం చాలా సున్నితంగా ఉంటుంది. అది 0.0001% పరిధిలో కూడా ఆల్కహాల్‌ను గుర్తించగలదు. పైలెట్లు నిజంగా మద్యం సేవించకపోయినా మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి (false positive alcohol test).


పెర్ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లు, హ్యాండ్ శానిటైజర్లలో కొద్ది మొత్తంలో ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల విమాన ప్రయాణం ఆలస్యమతుంది. అలాగే పైలెట్‌పై కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంటుంది (Airline regulations). అక్టోబర్, 2023లో డీజీసీఏ ఓ స్పష్టమైన నిబంధనలను వెల్లడించింది. పైలెట్లు డ్యూటీకి వచ్చే ముందు పెర్ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లు, ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తులను వాడకుండా ఉండాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

డ్రైవర్‌కు గుండెపోటు.. గాల్లోకి ఎగిరిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..


మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో స్ట్రాబెర్రీ ఎక్కడుందో 12 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2025 | 09:25 AM