Car flies into air: డ్రైవర్‌కు గుండెపోటు.. గాల్లోకి ఎగిరిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 14 , 2025 | 09:02 AM
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఓ కారు అమాంతం గాల్లోకి ఎగిరింది. లాంగ్ ఐలాండ్‌లోని సన్‌రైజ్ హైవే పై నుంచి ఆ కారు గాల్లోకి ఎగిరింది. కారు వేగంగా నడుపుతుండగా డ్రైవర్‌కు గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఓ కారు అమాంతం గాల్లోకి ఎగిరింది. లాంగ్ ఐలాండ్‌లోని సన్‌రైజ్ హైవే పై నుంచి ఆ కారు గాల్లోకి ఎగిరింది. కారు వేగంగా నడుపుతుండగా డ్రైవర్‌కు గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటన ఓ కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డు అయింది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Long Island crash).
లాంగ్ ఐలాండ్‌లోని సన్‌రైజ్ హైవే ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది (Car accident New York). ఈ నెల మూడో తేదీన ఓ వ్యక్తి తన కారులో ఆ హైవేపై వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో కారు బ్యాలెన్స్ కోల్పోయింది. రోడ్ల మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టి అమాంతం గాల్లోకి ఎగిరి దూరంగా పడింది. ఏకంగా సన్‌రైజ్ హైవే ఆరు లేన్‌లను దాటి, అవతలి వైపు ఉన్న చెట్టును ఢీకొట్టిందని చెబుతున్నారు. అయితే అంత భారీ ప్రమాదం జరిగినా డ్రైవర్ కేవలంల స్వల్ప గాయాలతో బయటపడడం అదృష్టం (Shocking crash video).
ఈ ఘటన ఆ లేన్‌లో వస్తున్న కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డు అయింది (NY traffic incident). దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద ప్రమాదం జరిగినా డ్రైవర్ కేవలం స్వల్ప గాయాలతో బయటపడడం, అంత బిజీ హైవే మీద ఆ కారు ఇంకెవరనీ ఢీకొట్టకపోవడం అదృష్టమని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఈ బాలుడు యమధర్మరాజుకు చుట్టమేమో.. సైకిల్ ఎలా తొక్కుతున్నాడో చూడండి..
వామ్మో.. ఈ పంది పిల్లకు ఎంత ధైర్యం.. మూడు చిరుతలను ఎలా తరిమిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..