Share News

Warthog vs Cheetah: వామ్మో.. ఈ పంది పిల్లకు ఎంత ధైర్యం.. మూడు చిరుతలను ఎలా తరిమిందో చూడండి..

ABN , Publish Date - Sep 13 , 2025 | 07:13 AM

సాధారణంగా అడవిలోని జంతువులకు అడవి పందులు సులభమైన టార్గెట్. పులులు, సింహాలు ఇతర క్రూరమృగాలకు ఆకలి వేస్తే అడవి పందులు ఆహారమైపోతాయి. ఇక, అడవి పంది పిల్లలను పట్టుకోవడం మరింత సులభం.

Warthog vs Cheetah: వామ్మో.. ఈ పంది పిల్లకు ఎంత ధైర్యం.. మూడు చిరుతలను ఎలా తరిమిందో చూడండి..
warthog vs cheetah

సాధారణంగా అడవిలోని జంతువులకు అడవి పందులు సులభమైన టార్గెట్. పులులు, సింహాలు ఇతర క్రూరమృగాలకు ఆకలి వేస్తే అడవి పందులు ఆహారమైపోతాయి. ఇక, అడవి పంది పిల్లలను పట్టుకోవడం మరింత సులభం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఆ వీడియోలో ఓ అడవి పంది పిల్ల ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు చిరుతలను తరిమి కొట్టింది (warthog bravery).


latestkruger అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (cheetah chase). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో మూడు చిరుతలు ఓ అడవి పంది పిల్లను రౌండప్ చేశాయి. అయితే ఆ పంది పిల్ల భయపడకుండా ధైర్యంగా ఎదురుదాడికి దిగింది. చిరుతలను వెంటాడింది. దీంతో ఆ మూడు చిరుతలు పారిపోయాయి. ఇది చూస్తే షాకింగ్ అనిపించకమానదు. ఎందుకంటే అడవి పందులు క్రూరమృగాలను ఎదురించి పోరాడలేవు. అందులోనూ చిరుతలపై ఎదురుదాడికి దిగడం సాధ్యం కాదు (Warthog viral video).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (wild animal encounters). ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. 22 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. చిరుతలకు ఎంత అవమానం జరిగింది అని ఒకరు వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణకు మించినది ఏముంది అని మరొకరు అన్నారు. ఆ పంది పిల్ల నిజమైన బాస్ అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

బరువు తగ్గండి.. లక్షలు సంపాదించండి.. ఉద్యోగులకు ఓ కంపెనీ ఆఫర్..


మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులను 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2025 | 01:28 PM