Share News

Yamraj nephew: వామ్మో.. ఈ బాలుడు యమధర్మరాజుకు చుట్టమేమో.. సైకిల్ ఎలా తొక్కుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:37 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు చేసే ప్రాణాంతక సాహసాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Yamraj nephew: వామ్మో.. ఈ బాలుడు యమధర్మరాజుకు చుట్టమేమో.. సైకిల్ ఎలా తొక్కుతున్నాడో చూడండి..
man shocking stunt

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు చేసే ప్రాణాంతక సాహసాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని కుర్రాడు సైకిల్ తొక్కే తీరు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే (man shocking stunt).


@Siimplymee1234 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియో (viral daring stunt)ను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు ప్రధాన రహదారిపై వేగంగా సైకిల్ తొక్కుతున్నాడు. కార్లు, బైక్‌లు, పెద్ద పెద్ద ట్రక్కులు వేగంగా వస్తుండగా, వాటికి ఎదురుగా ఆ కుర్రాడు సైకిల్ పోనిస్తున్నాడు. చివరి నిమిషంలో కట్ కొట్టి సైకిల్‌ను పక్కకు తప్పిస్తున్నాడు. ఆ కుర్రాడు ఇలా ఒకటి లేదా రెండుసార్లు కాదు, చాలా సార్లు చేశాడు. ఇది గొప్ప ట్యాలెంట్ అయినప్పటికీ, ఏమైనా తేడా జరిగితే ప్రాణాలు కోల్పోవాల్సిందే (unbelievable stunt man).


ఆ కుర్రాడి స్టంట్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Yamraj nephew video). ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. హే బ్రదర్.. మీరు చనిపోవడానికి ఎందుకు అంత ఇష్టపడతారని ఒకరు కామెంట్ చేశారు. యమరాజ్ మేనల్లుడు అని మరొకరు పేర్కొన్నారు. ఆ కుర్రాడికి ఏమైంది అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

బరువు తగ్గండి.. లక్షలు సంపాదించండి.. ఉద్యోగులకు ఓ కంపెనీ ఆఫర్..


మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులను 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2025 | 12:37 PM