Sick leave text: ఆరోగ్యం బాగోలేదని బాస్‌కు మెసేజ్.. పది నిమిషాల్లోనే ఎంతో ఘోరం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:28 AM
జీవితం ఎంత దుర్బలమైనదో తెలియజేసే షాకింగ్ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల ఓ ఉద్యోగి తన బాస్‌కు సిక్ లీవ్ కోసం మెసేజ్ పంపిన కొన్ని నిమిషాలకే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన అతడి కుటుంబ సభ్యులను, సహోద్యోగులను, నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది.
జీవితం ఎంత దుర్బలమైనదో తెలియజేసే షాకింగ్ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల ఓ ఉద్యోగి తన బాస్‌కు సిక్ లీవ్ కోసం మెసేజ్ పంపిన కొన్ని నిమిషాలకే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు (sudden death). ఈ ఘటన అతడి కుటుంబ సభ్యులను, సహోద్యోగులను, నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఊహించని ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కొంటుండడాన్ని ఈ ఘటన మరోసారి హైలెట్ చేసింది (Employee dies after sick leave text).
ఒక సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న కేవీ అయ్యర్ అనే వ్యక్తి ఈ విషయాన్ని తెలియజేశారు. శంకర్ అనే ఉద్యోగి ఉదయం 8:37 గంటలకు కేవీ అయ్యర్‌కు సిక్ లీవ్ కోరుతూ మెసేజ్ చేశారు (Heart Stroke). తనకు తీవ్రంగా వెన్ను నొప్పి ఉందని, సెలవు కావాలని కోరుతూ మెసేజ్ చేశారు. అయ్యర్.. 'సరే.. విశ్రాంతి తీసుకో' అని రిప్లై ఇచ్చి తన పనిలో మునిగిపోయారు. ఆ మెసేజ్ పంపిన 10 నిమిషాల తర్వాత, ఉదయం 8:47 గంటలకు శంకర్ ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. కాసేపటికే మరణించారు. ఈ విషయం ఉదయం 11 గంటలకు అయ్యర్‌కు తెలిసిందే. షాకైన అయ్యర్ వెంటనే శంకర్ ఇంటికి వెళ్లారు (Unexpected death news).
శంకర్ చాలా ఆరోగ్యకరంగా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని గడిపారని, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటారని అయ్యర్ తెలిపారు (Shocking employee story). వివాహితుడైన అతడికి ఒక కుమారుడు ఉన్నాడని అయ్యర్ పేర్కొన్నారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా మంది షాక్‌కు గురవుతున్నారు. వెన్నునొప్పి, అలసట, చెమట, వికారం వంటి గుండెపోటు లక్షణాలను గ్యాస్ట్రిక్ లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలుగా భావించి నిర్లక్ష్యంగా ఉండడం కూడా గుండెపోటు మరణాలకు కారణమవుతోందని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
పైలెట్లు పెర్ఫ్యూమ్ ఎందుకు వేసుకోరు.. అసలు కారణమేంటో తెలిస్తే..
మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో స్ట్రాబెర్రీ ఎక్కడుందో 12 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..