Lovers Viral Video: బస్టాండ్‌లో బరితెగించిన ప్రేమికులు.. అంతా చూస్తుండగానే..
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:34 PM
బస్టాండ్‌లో ప్రయాణికులంతా బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడే ఉన్న ఓ ప్రేమ జంట వారితో పాటూ బస్సు కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ క్రమంలో వారు చేసిన పని అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది.
కొందరు ప్రేమికులు రోజు రోజుకు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను.. నలుగురిలో చేస్తున్నారు. కొందరైతే చుట్టూ జనం ఉన్నా కూడా హద్దులు మీరి ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి అసభ్యకరమైన పనులన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం అందరి వద్దా ఫోన్లు ఉండడంతో ఇలాంటి ప్రేమికులు వికృత చేష్టలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బస్టాండ్‌లో ప్రేమికులు చేసిన పని చూసి అంతా మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బస్టాండ్‌లో (Bus stand) ప్రయాణికులంతా బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడే ఉన్న ఓ ప్రేమ జంట వారితో పాటూ బస్సు కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ క్రమంలో వారు చేసిన పని అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది.
చుట్టూ అంతా ఉన్నా కూడా అదేమీ పట్టించుకోకుండా ఇద్దరూ ముద్దులు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా అటూ, ఇటూ తిరుగుతూ ప్రయాణికుల మధ్యలోనే (Lovers behaved indecently) అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇలా చాలా సేపు వారిద్దరూ ఇలా ముద్దులు పెట్టుకుంటూ అక్కడే ఉన్నారు. ప్రేమికుల ప్రవర్తనను చూసిన కొందరు, వారి ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మనుషులు రోజు రోజుకూ జంతువుల్లా మారిపోతున్నారు’.. అంటూ కొందరు, ‘నేటి తరానికి ఏమైందీ.. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3800కి పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి