Funny Viral Video: వరద నీటిని ఇలా వాడుకోవడం ఎక్కడైనా చూశారా.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:19 PM
భారీ వర్షాల కారణంగా వరద నీరు వీధుల్లో పొంగి ప్రవహిస్తోంది. దీంతో అంతా తలుపులు మూసుకుని ఇంట్లో ఉన్నారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి నుంచి బకెట్ పట్టుకుని బయటికి వచ్చాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
భారీ వర్షాలు, వరదల సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మరోవైపు ఇళ్ల్లోకి వరద నీరు రావడం వల్ల అవస్థలు పడాల్సి వస్తుంటుంది. అయితే కొందరు మాత్రం వరద నీటిలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వరద నీటిలో చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘వరద నీటిని ఇలా వాడేశావేంట్రా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు వీధుల్లో పొంగి ప్రవహిస్తోంది. దీంతో అంతా తలుపులు మూసుకుని ఇంట్లో ఉన్నారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి నుంచి బకెట్ పట్టుకుని బయటికి వచ్చాడు.
అందులో నుంచి ఖాళీ మద్యం సీసాలను (Man throwing empty bottles into floodwater) బయటికి తీసి, వరద నీటిలో పడేశాడు. ఇలా బకెట్‌లో ఉన్న సీసాలన్నింటినీ వరద నీటిలో పడేశాడు. దీంతో అవి నీటిపై తేలుతూ కొట్టుకుపోయాయి. మామూలుగా అయితే వాటిని దూరంగా డస్ట్ బిన్‌లో పడేయాల్సిన పరిస్థితి ఉండేది. వరద నీటి కారణంగా ఆ పని తప్పింది. ఇలా వరద నీటిని సైతం అతను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆహా.. వరద నీటిని ఇలాక్కూడా వాడుకోవచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘పెద్ద పని తప్పిపోయిందిగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి