Share News

Lions VS Rhinos: ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Sep 23 , 2025 | 07:34 PM

ఓ మగ సింహం.. ఆడ సింహంతో కలిసి వేటకు వెళ్లింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వేట కోసం వేచి చూస్తున్న సమయంలో కొన్ని ఖడ్గమృగాలు అటుగా వస్తాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Lions VS Rhinos: ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

అడవిలో సింహాలకు తిరుగులేదని అంతా అనుకుంటారు. కానీ వాస్తవంగా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అప్పుడప్పుడూ సింహాలు సైతం కొన్ని జంతువుల చేతిలో ఓడిపోవాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం ఖడ్గమృగాలను భయపెట్టాలని చూసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మగ సింహం.. ఆడ సింహంతో కలిసి వేటకు వెళ్లింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వేట కోసం వేచి చూస్తున్న సమయంలో కొన్ని ఖడ్గమృగాలు అటుగా వస్తాయి. వాటిని చూడగానే మగ సింహానికి ఏమనిపించిదో ఏమో గానీ.. ఎదురుగా వెళ్లి భయపెట్టాలని చూసింది.


ఆడ సింహం వెనుక వైపు పడుకుని చూస్తూ ఉండగా.. మగ సింహం తన పవర్ చూపించాలని అడుగు ముందుకు వేసింది. ‘దేఖో మై రౌడీయిజం’.. అంటూ ఆడ సింహం ముందు బిల్డప్ ఇస్తున్నట్లుగా అడుగు ముందుకు వేసింది. అయితే అంతలోనే దానికి గర్వభంగం జరిగింది. సింహం ముందుకు రావడాన్ని చూసి ఖడ్గమృగాలు రెండు అడుగులు ముందుకేసి.. కొమ్ముతో (rhinos chasing away lions) పైకి ఎగరేయాలని చూశాయి. ఖడ్గమృగాల ఆవేశం చూసి భయపడిపోయిన సింహం.. ‘మన పవర్ పని చేయలేదు.. లగెత్తు డార్లింగ్’.. అన్నట్లుగా అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో పాటే ఆడ సింహం కూడా అక్కడి నుంచి పారిపోతుంది.


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సింహాలకు చుక్కలు చూపించిన ఖడ్గమృగాలు’.. అంటూ కొందరు, ‘ప్రియురాలి ముందు పరువు పోయిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 1.25 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..

పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 07:34 PM