Share News

Theft Viral Video: కళ్లెదురుగా ఉంటూనే కొట్టేశాడుగా.. చోరీ చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Sep 24 , 2025 | 10:04 AM

ఓ పెద్ద హోటల్లోకి వెళ్లిన ఇద్దరు యువకులు రిసెప్షన్ దగ్గర నిలబడి సిబ్బందితో మాట్లాడుతుంటారు. ఓ యువకుడు రిసెప్షనిస్ట్‌తో మాటలు కలపగా.. ఇంకో యువకుడు చోరీకి స్కెచ్ గీశాడు. చివరకు ఎలా చోరీ చేశాడో మీరే చూడండి..

Theft Viral Video: కళ్లెదురుగా ఉంటూనే కొట్టేశాడుగా.. చోరీ చూస్తే షాకవ్వాల్సిందే..

దొంగలు తెలివిమీరిపోయారు. రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేసే వారు కొందరైతే.. మరికొందరు కళ్లెదురుగానే ఉంటూ కనికట్టు చేసినట్లుగా చోరీలు చేస్తుంటారు. ఇలాంటి వారు చేసే చోరీలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద హోటల్లోకి వెళ్లిన ఇద్దరు యువకులు రిసెప్షన్ దగ్గర నిలబడి సిబ్బందితో మాట్లాడుతుంటారు. ఓ యువకుడు రిసెప్షనిస్ట్‌తో మాటలు కలపగా.. ఇంకో యువకుడు అక్కడే ఉన్న పూజా పళ్లెంపై కన్నేశాడు. పళ్లెంలో ఉన్న నగదును ఎలాగైనా కొట్టేయాలని ఫిక్స్ అయిన అతను.. మెల్లిగా తన చేయిని కొంచెం కొంచెం జరుపుతూ ప్లేటు వద్దకు తీసుకెళ్లాడు.


ఆ తర్వాత ప్లేటులోని నోటును తీసుకుని (Thief steals cash from Pooja plate) అంతే చాకచక్యంగా నటిస్తూ జేబులో వేసుకున్నాడు. రిసెప్షనిస్ట్ ఎదురుగా ఉన్నా కూడా అతను ఈ చోరీని ఎంతో తెలివిగా చేసేశాడు. వెనుకే సెక్యూరిటీ గార్డు ఉన్నా కూడా దీన్ని గమనించడు. ఇలా కళ్లెదురుగా ఉంటూనే కనికట్టు చేసినట్లుగా చోరీ చేశాడన్నమాట. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ దొంగ టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘సీసీ కెమెరాలో లేకుంటే ఇలాంటి వారు దొరికే అవకాశమే ఉండదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 1.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2025 | 10:04 AM