Accident Viral Video: బాల్కనీలో నీళ్లు తాగుతూ అడుగు వెనక్కు వేశాడు.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:14 AM
నజీర్ అనే వ్యాపారి.. వస్త్ర దుకాణంలోని పై అంతస్తు బాల్కనీలో నిలబడి నీళ్లు తాగుతున్నాడు. అయితే నీళ్లు తాగే క్రమంలో ఒక అడుగు వెనక్కు వేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
విధి ఎంతో విచిత్రమైనది. కొందరి విషయంలో కన్నెర్ర చేస్తుంది.. మరికొందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అప్పటిదాకా బాగున్న వారు అంతలోనే మృత్యుఒడిలోకి జారుకుంటుంటారు. ఇంకొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి లక్కీగా బయటపడుతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బాల్కనీలో నీళ్లు తాగుతూ అడుగు వెనక్కు వేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) జోధ్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నజీర్ అనే వ్యాపారి.. వస్త్ర దుకాణంలోని పై అంతస్తు బాల్కనీలో నిలబడి నీళ్లు తాగుతున్నాడు. అయితే నీళ్లు తాగే క్రమంలో ఒక అడుగు వెనక్కు వేశాడు. ఇలా అడుగు వేయగానే ఒక్కసారిగా అదుపు తప్పి (man falls from balcony) బాల్కనీ గోడ పైనుంచి వెనక్కు పడిపోయాడు.
అతను పడిపోయిన శబ్ధం వినగానే అంతా పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. చివరకు అంతా కలిసి అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలిసింది. బాల్కనీపై ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎట్టకేలకు ఆ వ్యక్తి పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయిందిగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ప్రదేశాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2200కి పైగా లైక్‌లు, 5.48 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి