Watch Video: స్కూల్‌కు వెళ్లిన కూతురు.. తల్లికి అనుమానం వచ్చి వెనుకే వెళ్లగా.. చివరకు..
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:29 PM
ఓ బాలిక ఇంటి నుంచి స్కూల్‌కు బయలుదేరింది. అయితే ఆమె ప్రవర్తనపై కొద్ది రోజులుగా అనుమానంగా ఉన్న తల్లి.. ఆ రోజు ఎలాగైనా విషయం ఏంటో తెలుసుకోవాలని వెనుకే వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రస్తుతం చాలా మంది యువత చదువును పక్కన పెట్టి ప్రేమ పేరుతో పక్కదారి పడుతున్నారు. మరికొందరు చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను పాడుచేసుకుంటున్నారు. 18 ఏళ్లు కూడా నిండని కొందరు ఆడ పిల్లలు కూడా ఇటీవల ప్రేమ పేరుతో మోసపోవడం చూస్తున్నాం. మరికొందరు తమ ప్రేమికులతో సహా తల్లిదండ్రులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్కూల్‌కు వెళ్లిన కూతురిపై తల్లికి అనుమానం కలిగింది. వెనుకే వెళ్లగా చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలిక ఇంటి నుంచి స్కూల్‌కు బయలుదేరింది. అయితే ఆమె ప్రవర్తనపై కొద్ది రోజులుగా అనుమానంగా ఉన్న తల్లి.. ఆ రోజు ఎలాగైనా విషయం ఏంటో తెలుసుకోవాలని వెనుకే వెళ్లింది. స్కూల్‌కు అని వెళ్లిన బాలిక.. మార్గ మధ్యలో ప్రియుడితో కలిసి సరసాలు ఆడడం కనిపించింది.
కూతురిని ఆ పరిస్థితిలో చూసిన తల్లికి కోపం కట్టలు తెంచుకుంది. కూతురిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి, (Mother beat her daughter) అందరి ముందూ చితకబాదింది. దీంతో చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమికూడారు. కొందరు బాలికపై దాడి జరకుండా విడిపించి, వారికి సర్దిచెప్పడం కూడా వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సమాజం ఎటు పోతోంది.. చదువుకోవాల్సిన వయసులో ఈ పనులేంటీ’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5300కి పైగా లైక్‌లు, 1.97 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి