Trick Viral Video: క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:00 AM
పేస్ట్, బ్యూటీకి సంబంధించిన క్రీములు వాడేవారు.. అవి అయిపోయే దశలో ఉన్నప్పుడు పక్కన పడేస్తుంటారు. కొందరైతే అందులోని క్రీమ్ బయటికి తీసేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఈ సమస్యకు ఓ మహిళ సింపుల్‌గా పరిష్కారం చూపించింది..
సోషల్ మీడియాలో వివిధ రకాల ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పెద్ద పెద్ద సమస్యలకు చిన్న చిన్న చిట్కాలతో పరిష్కారాలు చూపుతుంటారు. ఇంకొందరు పనికిరావని పక్కన పడేసిన వస్తువులను తిరిగి అద్భుతంగా పనికొచ్చేలా చేస్తుంటారు . తాజాగా, ఓ మహిళ ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఖాళీ అయిన ట్యూబ్ నుంచి చిన్న ట్రిక్‌తో తిరిగి క్రీమ్ బయటికి రప్పించడం చూసి అంత అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పేస్ట్, బ్యూటీకి సంబంధించిన క్రీములు వాడేవారు.. అవి అయిపోయే దశలో ఉన్నప్పుడు పక్కన పడేస్తుంటారు. కొందరైతే అందులోని క్రీమ్ బయటికి తీసేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఈ సమస్యకు ఓ మహిళ సింపుల్‌గా పరిష్కారం చూపించింది.
ట్యూబ్ వెనుక వైపు భాగాన్ని కత్తిరించిన ఆమె.. ఆ తర్వాత దాని మూతను లోపల చొప్పించింది. ఆపై కత్తెర తీసుకుని ఆ మూతను లోపలికి నెట్టింది. ఇలా చేయడం వల్ల లోపల క్రీమ్ మొత్తం బయటికి వచ్చేసింది. ఇలా అయిపోయిందనుకున్న ట్యూబ్ నుంచి (Woman cleverly takes cream out of tube) ఎంతో తెలివిగా క్రీమ్‌ను బయటికి తీసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..
చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి