Monkey Funny Video: మహిళ కళ్లద్దాలను లాక్కున్న కోతికి షాక్.. ఇతనేం చేశాడో చూస్తే పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:00 PM
ఓ అందమైన ప్రదేశంలో పర్యాటకులు.. ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే ఓ కోతి ఆహారం కోసం దీనంగా కూర్చుని ఉంది. అంతా ఆ కోతిని చూసి ఎంతో బుద్ధిగా ఉందని అనుకున్నారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కోతి చేష్టలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి దాకా కామ్‌గా ఉండే కోతులు.. సడన్‌గా మీదపడి రక్కుతుంటాయి. మరికొన్నిసార్లు చేతిలోని ఆహార పదార్థాలను బలవంతంగా లాక్కెళ్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏంకగా గుండె ఆగిపోయేలా భయపెడుతంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహిళ కళ్లద్దాలు లాక్కున్న కోతికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. చివరకు ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన ప్రదేశంలో పర్యాటకులు.. ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే ఓ కోతి ఆహారం కోసం దీనంగా కూర్చుని ఉంది. అంతా ఆ కోతిని చూసి ఎంతో బుద్ధిగా ఉందని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ తన కళ్లద్దాలను తలకు తగిలించుకుని అటుగా వచ్చింది.
ఆమె కళ్లద్దాలపై కన్నేసిన కోతి.. తీరా దగ్గరికి రాగానే రెప్పపాటు (Monkey snatches woman's glasses) కాలంలో లాగేసుకుంటుంది. కోతి కళ్లద్దాలను లాక్కోవడంతో ఉలిక్కిపడిన ఆమె.. తిరిగి తీసుకునే ధైర్యం చేయలేక సైలెంట్‌గా పక్కకు వెళ్లిపోతుంది. అయితే ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. ముందు సైలెంట్‌గానే ఉండి, కోతి పరధ్యానంలో ఉండడం చూసి (man stole glasses from monkey) చటుక్కున కళ్లద్దాలను లాగేసుకున్నాడు. కోతి ఎలాగైనా మెరుపు వేగంతో కళ్లద్దాలను లాగేసుకుందో.. అంతే వేంగా, అంతే చాకచక్యంగా ఆ వ్యక్తి కూడా కళ్లద్దాలను కోతి నుంచి లాగేసుకున్నాడు.
అతను కళ్లద్దాలను లక్కోగానే కోతి ఒక్కసారిగా షాకవుతుంది. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కోతికి భలే షాకిచ్చాడుగా’.. అంటూ కొందరు, ‘కోతికి సరైన వ్యక్తి తగిలాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 3.35 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..
ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి