Share News

Viral Video: పాము కోసం పరుపు ఎత్తి చూడగా షాకింగ్ సీన్.. భార్య బండారం ఎలా బయటపడిందంటే..

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:01 AM

కొందరు వ్యక్తులు చేతిలో కర్రలు పట్టుకుని హడావుడిగా ఓ ఇంట్లోకి వెళ్లారు. పాము కోసం వెతుకుతున్నట్లుగా ఇంట్లో అటూ, ఇటూ చూశారు. తర్వాత మంచం కింద వెతికేందుకు పరుపును పైకి ఎత్తుతారు. పరుపు తీసి చూడగా..

Viral Video: పాము కోసం పరుపు ఎత్తి చూడగా షాకింగ్ సీన్.. భార్య బండారం ఎలా బయటపడిందంటే..

భార్యకు తెలీకుండా భర్త.. భర్తకు తెలీకుండా భార్య చేసే పనులు చివరకు వారి సంసారంలో చిచ్చు పెడుతుంటాయి. ఇలాంటి విషయాలను ఎంత దాచాలని చూసినా ఏదో ఒక రోజు బయటపడిపోతుంటాయి. కొన్నిసార్లు భార్యాభర్తలు.. వివాహేతర సంబంధాలు పెట్టుకుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాము దూరిందనే అనుమానంతో మంచంపై పరుపు ఎత్తి చూడగా దాని కింద ప్రియుడు కనిపించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు చేతిలో కర్రలు పట్టుకుని హడావుడిగా ఓ ఇంట్లోకి వెళ్లారు. పాము కోసం వెతుకుతున్నట్లుగా ఇంట్లో అటూ, ఇటూ చూశారు. తర్వాత మంచం కింద వెతికేందుకు పరుపును పైకి ఎత్తుతారు. చివరకు పరుపు తీసి చూడగా.. దాని కింద షాకింగ్ సీన్ కనిపించింది.


మంచం కింద ఓ వ్యక్తి పడుకుని ఉండడం (Boyfriend sleeping under the bed) చూసి అంతా షాక్ అయ్యారు. తర్వాత అతన్ని బయటికి తీసి, వారి చేతిలోని కర్రలతో అతన్ని చితకబాదారు. ఈ ఘటనతో అక్కడ జనం గుమికూడతారు. కొందరు మహిళలు అతన్ని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. వీడియో చూస్తుంటే.. భర్తకు తెలీకుండా తన ప్రియుడిని ఇంటికి పిలుపించుకున్న భార్య.. ఇలా మంచం కింద దాచినట్లు అర్థమవుతోంది.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారి వల్ల సంసారాలు నాశనమవుతున్నాయి’.. అంటూ కొందరు, ‘వివాహేతర సంబంధాలు ఎన్నటికీ దాగవు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3700కి పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 11:02 AM