Share News

Truck Driver Viral Video: రన్నింగ్‌లో ఉండగా నిద్రపోయిన డ్రైవర్.. 2 నిముషాల తర్వాత చూడగా..

ABN , Publish Date - Sep 25 , 2025 | 09:42 AM

ట్రక్ నడుపుతున్న ఓ వ్యక్తి.. చాలా దూరం వరకూ సక్రమంగానే ఉన్నాడు. అయితే ఆ తర్వాత సడన్‌గా నిద్రలోకి జారుకున్నాడు. 2 నిముషాల తర్వాత చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..

Truck Driver Viral Video: రన్నింగ్‌లో ఉండగా నిద్రపోయిన డ్రైవర్.. 2 నిముషాల తర్వాత చూడగా..

ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొందరు అవగాహన లేక డ్రైవింగ్ చేయడం, మరికొందరు డ్రైవింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం, ఇంకొందరు రోడ్డు నిబంధనలు పాటించడకపోవడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా, ఓ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రక్ నడుపుతున్న డ్రైవర్ సడన్‌గా నిద్రలోకి జారుకున్నాడు. 2 నిముషాల తర్వాత చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ట్రక్ నడుపుతున్న ఓ వ్యక్తి.. చాలా దూరం వరకూ సక్రమంగానే ఉన్నాడు. అయితే ఆ తర్వాత సడన్‌గా నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా అతడి చేయి స్టీరింగ్ మీద ఉండడంతో వాహనం అటూ, ఇటూ వెళ్లకుండా నేరుగా రోడ్డుపైనే దూసుకెళ్లింది. మధ్య మధ్యలో వాహనాలు ఎదురుగా వచ్చినా కూడా అదృష్టవశాత్తు వాటిని ఢీకొట్టకుండా ముందుకు వెళ్తుంది.


ఇలా ట్రక్ రోడ్డు మీద దూసుకెళ్తుండగా.. (Truck Driver Sleeps while running) డ్రైవర్ హాయిగా నిద్రపోతున్నాడు. అయితే రెండు నిముషాల తర్వాత అతడికి సడన్‌గా మెలకువ వచ్చింది. లేచి చూడగా అప్పటికే ట్రక్కు రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. దీంతో భయపడిపోయిన అతను.. దాన్ని అదుపు చేసే క్రమంలో స్టీరింగ్ అటూ, ఇటూ తిప్పాడు. దీంతో చివరకు ట్రక్కు రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. ట్రక్కు కిందపడిన కాసేపటికి అతను మెల్లిగా క్యాబిన్ లోనుంచి పైకి లేచి బయటికి వెళ్లిపోయాడు.


ఈ ట్రక్కుకు ముందు వైపు, క్యాబిన్‌లో సీసీ కెమెరాలు అమర్చడంతో ఈ ఘటన మొత్తం రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’.. అంటూ కొందరు, ‘ఇలాటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 28 వేలకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

చుట్టుముట్టిన అడవి కుక్కలు.. మాస్టర్ ప్లాన్ వేసిన జింకలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 09:42 AM