Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న చిరుతను 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే..
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:32 AM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అడవి మొత్తం పెద్ద పెద్ద చెట్లు, గడ్డితో పచ్చగా కనిపిస్తోంది. అయితే ఇదే చిత్రంలో ఓ చిరుతపులి దాగి ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా చేస్తాయి. అందులో దాక్కున్న పజిల్స్ చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ఆసక్తికర పజిల్స్‌ను పరిష్కరించడానికి నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల కాలక్షేపంతో పాటూ మనలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. తాజాగా, మీ కోసం ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కున్న చిరుతను 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అడవి మొత్తం పెద్ద పెద్ద చెట్లు, గడ్డితో పచ్చగా కనిపిస్తోంది.
ఆ చెట్ల వెనుక మంచుతో కూడిన దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఇవి చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. అయితే అందమైన దృశ్యాల వెనుక ఓ ప్రమాదం పొంచి ఉంది. పైకి చూస్తే ఈ చిత్రంలో చెట్లు, పొదలు తప్ప ఇంకే జంతువూ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీ కంటికి కనిపించకుండా ( leopard hiding in forest) ఈ పొదల మాటున చిరుత పులి దాగి ఉంది.
వేట దగ్గరికి రాగానే సడన్‌గా దాడి చేయాలని చిరుత వేచి చూస్తోంది. చాలా మంది ఆ చిరుతను గుర్తించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా చాలా మంది చిరుతను గుర్తించలేకపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ చిరుత ఎక్కడుందో మీరైనా కనుక్కునేందుకు ప్రయత్నించండి.
ఒకవేళ ఇప్పటికీ ఆ చిరుతను గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..
ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..