Share News

Young Women Funny Video: డాన్స్ చేస్తున్న యువతికి సడన్‌గా షాక్.. ఎదురుగా ఏమొచ్చిందో చూస్తే..

ABN , Publish Date - Sep 25 , 2025 | 01:58 PM

ఇంటి పైకి వెళ్లిన ఓ యువతి.. ఫోన్ నేలపై పెట్టి.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేయడం (young woman is dancing) స్టార్ట్ చేసింది. అయితే డాన్స్ మధ్యలో ఉండగానే.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Young Women Funny Video: డాన్స్ చేస్తున్న యువతికి సడన్‌గా షాక్.. ఎదురుగా ఏమొచ్చిందో చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత మొత్తం రీల్స్ చుట్టూ తిరుగుతోంది. ఏమాత్రం అవకాశం దొరికినా చాలు.. రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే ఇలా వీడియోలు తీసుకునే క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసారలర్లు తమాషా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఫోన్ ఎదురుగా డాన్స్ చేస్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంటి పైకి వెళ్లిన ఓ యువతి.. ఫోన్ నేలపై పెట్టి.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేయడం (young woman is dancing) స్టార్ట్ చేసింది. అయితే డాన్స్ మధ్యలో ఉండగానే.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి వచ్చిన కోతి.. నేరుగా ఫోన్ వద్దకు వెళ్లి నిల్చుంది.


అంతటితో ఆగకుండా.. టేక్ ఓకే.. ప్యాకప్.. అన్నట్లుగా ఫోన్‌‌ను తీసుకుంది. దీంతో అప్పటిదాకా డాన్స్ చేస్తున్న యువతి.. కోతిని చూసి భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఫోన్‌‌ను నోట కరుచుకున్న కోతి.. (monkey took the phone) అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే చివరకు ఎలాగోలా కోతి నుంచి ఫోన్‌ను తిరిగి తీసుకుంది. అయితే కోతి ఫోన్‌ను తీసుకెళ్తున్న సమయంలో కెమెరా ఆన్‌‌లో ఉండడంతో మొత్తం రికార్డ్ అయింది.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘యువతికి షాకిచ్చిన కోతి’.. అంటూ కొందరు, ‘ఈ కోతి మరీ ఫన్నీగా ఉందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 2.21 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..

ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 01:58 PM