Camel Viral Video: వావ్.. ఈ ఒంటె తెలివి మామూలుగా లేదుగా.. నీళ్లు ఎలా తాగుతుందో చూస్తే..
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:39 PM
ఓ ఒంటెకు బాగా దాహం వేసినట్లు ఉంది. దీంతో నీటి కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదు. అంతా వెతికిపోయిన ఒంటెకు.. చివరకు దూరంగా ఓ కుళాయి కనిపించింది. దీంతో పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. అయితే..
ఒంటెలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒంటెలు చూసేందుకు ఎంత విచిత్రంగా ఉంటాయో.. కొన్నిసార్లు వాటి ప్రవర్తన కూడా అంతే విచిత్రంగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఒంటె నీళ్లు తాగిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఒంటె తెలివి మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఒంటెకు (Thirsty camel) బాగా దాహం వేసినట్లు ఉంది. దీంతో నీటి కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదు. అంతా వెతికిపోయిన ఒంటెకు.. చివరకు దూరంగా ఓ కుళాయి కనిపించింది. దీంతో పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. అయితే కుళాయి దగ్గర తక్కువ నీరు ఉండడంతో తాగేందుకు వీలు లేకుండా పోయింది.
కుళాయి ఆన్ చేస్తే తప్ప నీళ్లు తాగే అవకాశం లేదు. దీంతో చివరకు ఒంటె తన బుర్రకు పదును పెట్టింది. కుళాయిని నోటితోనే ఆన్ చేసేసింది. ఆన్ చేసి చకచకా ( camel turned on tap and drank water) నీళ్లు తాగేసింది. దాహం వేసిన కాకి ఎలాగైతే తెలివిగా నీటిలోకి రాళ్లు వేసి, పైకి వచ్చిన తర్వాత తాగిందో.. ఈ ఒంటె కూడా తన దాహం తీర్చుకోవడానికి తెలివిగా వ్యవహరించింది. ఇలా జంతువులు తెలివిగా నీళ్లు తాగడం అప్పుడప్పుడూ చూస్తుంటాం.
తాజాగా, ఈ ఒంటె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ ఒంటె తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘మనుషులను చూసి నేర్చుకున్నట్లు ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి