Share News

Woman Funny Video: పెద్ద సమస్యే వచ్చిందిగా.. ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే..

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:14 PM

కారు నడుపుకొంటూ వచ్చిన ఓ మహిళ రోడ్డు పక్కన ఆపింది. తర్వాత యథావిధిగా డోరు తీసుకుని బయటికి వచ్చింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. కిందకు దిగిన తర్వాత డోరు వేయడంలో అసలు సమస్య వచ్చి పడింది..

Woman Funny Video: పెద్ద సమస్యే వచ్చిందిగా.. ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే..

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరి అతి తెలివితేటలు చూస్తే తెగ నవ్వుకునేలా ఉంటాయి. చాలా మంది తెలిసి తెలీక చేసే పనులు చూపరులకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళకు వచ్చిన సమస్య చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారు నడుపుకొంటూ వచ్చిన ఓ మహిళ రోడ్డు పక్కన ఆపింది. తర్వాత యథావిధిగా డోరు తీసుకుని బయటికి వచ్చింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. కిందకు దిగిన తర్వాత డోరు వేయడంలో అసలు సమస్య వచ్చి పడింది.


కారు ఇనుప స్తంభం పక్కనే ఉండడంతో డోరు వేయాలని చూసినా సాధ్యం కాలేదు. డోరు స్తంభానికి తగలడంతో వేయడం కుదరలేదు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా వాహనాన్ని కాస్త ముందుకు పోనిస్తారు. కానీ ఈమె మాత్రం అలాంటిది ఏమీ చేయకుండా (Woman trying to close car door) ఎలాగైనా డోరు వేయాలని చూసింది. సాధ్యం కాకపోవడంతో స్తంభాన్ని కొంచెం పక్కకు లాగాలని కూడా చూసింది. ఇలా ఆమె డోరు వేయడం కోసం నానాతిప్పలు పడాల్సి వచ్చింది.


ఈ ఘటనను కొందరు కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే.. ’’.. అంటూ కొందరు, ‘చాలా మంచి ఐడియా.. ఈమె టాలెంట్‌కు హ్యాట్సాప్’.. అంటూ మరికొందరు , ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 51 వేలకు పైగా లైక్‌లు, 3.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..

క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 12:14 PM