Jugaad Viral Video: వీడెవడండీ బాబూ.. వాషింగ్‌మెషిన్‌తో కుండల తయారీ.. చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:08 AM
వాషింగ్ మెషిన్‌ను దేనికోసం వాడతారు..? అని అడిగితే.. ఇదేం పిచ్చి పశ్న.. బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికి వాడతారు.. అని అంటారు కదా. కానీ ఇతను చేస్తున్న పని చూస్తే.. మీరంతా షాక్ అవకుండా ఉండలేరు.
ఒక వస్తువును అంతా ఒకదానికి ఉపయోగిస్తే.. కొందరు మాత్రం, మా రూటే సపరేటు.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇంట్లోని వస్తువులను చిత్రవిచిత్రంగా వాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కూలర్‌ను కూరగాయల స్టోర్‌గా కొందరు, బైక్ ఇంజిన్‌ను నీళ్లు తోడే యంత్రాలుగా వాడుతూ మరికొందరు, గ్యాస్ స్టవ్‌ను బాత్రూం షవర్‌గా వాడుతూ ఇంకొందరు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాషింగ్ మెషిన్‌ను దేనికోసం వాడతారు.. అని అడిగితే.. ఇదేం పిచ్చి పశ్న.. బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికి వాడతారు.. అని అంటారు కదా. కానీ ఇతను చేస్తున్న పని చూస్తే.. మీరంతా షాక్ అవకుండా ఉండలేరు. పాడైన వాషింగ్ మిషిన్‌ను పక్కన పడేయకుండా దాని సాయంతో (Making clay pots in washing machine) మట్టి కుండలు తయారు చేస్తున్నాడు.
ఇందుకోసం వాషిన్ మిషిన్‌లో బట్టలు వేసే ప్రాంతాన్ని మొత్తం కట్ చేశాడు. ప్లాస్టిక్ మొత్తాన్ని తొలగించగా.. కింద తిరుగుతన్న చక్రంపై ఓ చెక్క పలకను సెట్ చేశాడు. ఆ తర్వాత దానిపై మట్టి పోసి కుండ తయరు చేశాడు. దీంతో పాటూ చిన్న చిన్న మట్టి కుండలు, దీపాలు తదితరాలన్నీ తయారు చేసేస్తున్నాడు. సాధారణంగా కుండల తయారీ కోసం చెక్కలతో చేసే పెద్ద చక్రాలను ఉపయోగించడం అందరికీ తెలిసిందే. కానీ ఇతను అదే కుండలను ఇలా వాషింగ్ మెషిన్ చక్రం సాయంతో తయారు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వాషింగ్ మెషిన్ కంపెనీలు షాక్‌లో పడినట్లే ఇక’.. అంటూ కొందరు, ‘వాషింగ్ మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41 వేలకు పైగా లైక్‌లు, 1.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి