Share News

Lions Viral Video: ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..

ABN , Publish Date - Sep 27 , 2025 | 09:44 AM

ఆకలితో ఉన్న కొన్ని సింహాలకు ఓ దున్నపోతు కనిపించింది. ఇంకేముందీ.. అన్నీ కలిసి దానిపై ఎటాక్ చేశాయి. దున్నపోతును చుట్టుముట్టిన సింహాలు.. చంపేందుకు సిద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో..

Lions Viral Video: ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..

కొన్నిసార్లు కొందరు లక్కీగా ప్రమాదాల నుంచి బయటపడడం చూస్తుంటాం. అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. చావు అంచుల దాకా వెళ్లి, తిరిగి ప్రాణాలతో తిరిగివచ్చే అనేక జంతులను చూస్తుంటాం. కొన్నిసార్లు, ఇక ప్రాణాలు పోతాయనుకున్న సమంయలోనూ ఆశ్చర్యకరంగా బయటపడుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాల బారి నుంచి లక్కీగా తప్పించుకున్న దున్నపోతును చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ దున్న వెరీ లక్కీ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న కొన్ని సింహాలకు ఓ దున్నపోతు కనిపించింది. ఇంకేముందీ.. (Lions attack buffalo) అన్నీ కలిసి దానిపై ఎటాక్ చేశాయి. దున్నపోతును చుట్టుముట్టిన సింహాలు.. చంపేందుకు సిద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో ఓ మగ సింహం, ఆడ సింహానికి మధ్య గొడవ జరుగుతుంది.


ఆడ సింహంపైకి దూసుకొచ్చిన మగ సింహం.. దాన్ని అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా.. గొడవకు దిగుతాయి. ఇలా ఆ సింహాలన్నీ రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడతాయి. ఈ క్రమంలో అవన్నీ దున్నపోతుకు దూరంగా వెళ్లిపోతాయి. సందులో సడేమియా అన్నట్లుగా.. ఆ దున్నపోతు మెల్లిగా పైకి లేచి, (Buffalo escaping from lions) అక్కడి నుంచి వెళ్లిపోయి మందలోకి చేరుకుంటుంది.


ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ దున్నపోతు వెరీ లక్కీ గురూ’.. అంటూ కొందరు, ‘అదృష్టమంటే ఈ దున్నపోతుదే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3500కి పైగా లైక్‌లు, 3.72 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..

క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 09:44 AM