Train Viral Video: సినిమాను తలదన్నే సీన్.. దొంగ కోసం రైలు ఆపి మరీ రన్నింగ్.. చివరకు..
ABN , Publish Date - Sep 28 , 2025 | 03:59 PM
రన్నింగ్ రైల్లో ఓ దొంగ ఎవరిదో ఫోన్ లాక్కుని కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితుడు అలెర్ట్ కావడంతో చివరకు ప్రయాణికులంతా కలిసి.. రైలు ఆపి దొంగ కోసం కిందకు దూకేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇంటర్నెట్ డెస్క్: దొంగను పట్టుకునేందుకు హీరో.. హైవే రోడ్లు, రైలు గేట్లు, బ్రిడ్జ్‌లు దాటుతూ, ఎగురుతూ, దూకుతూ వెళ్లడం వంటి సీన్లు సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి సీన్లు నిజ జీవితంలోనూ కనిపిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలనూ అనేకం చూస్తుంటాం. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో ఓ దొంగ ఫోన్ చోరీ చేశాడు. దొంగ కోసం రైలు ఆపి మరీ ప్రయాణికులు రన్నింగ్ చేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రన్నింగ్ రైల్లో ఓ దొంగ ఎవరిదో ఫోన్ లాక్కుని (Thief steals phone on train) కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితుడు అలెర్ట్ కావడంతో చివరకు ప్రయాణికులంతా కలిసి.. రైలు ఆపి దొంగ కోసం కిందకు దూకేశారు. ఆ దొంగ రైలు ట్రాక్ పక్కన ఉన్న గడ్డి పొదల్లోకి దూరి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ప్రయాణికులంతా (Passengers chased Thief) ఆ దొంగ వెంటపడి మరీ పట్టుకున్నారు. దొంగ దొరకగానే అంతా తమ చెప్పులతో చితకొట్టారు. ఆ తర్వాత అతన్ని లాక్కెళ్లి పోలీసుకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం చూసేవారికి అదేదో సినిమా షూటింగ్‌లా అనిపించింది. అక్కడున్న ప్రయాణికులంతా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదంతా చూస్తుంటే సినిమా సీన్‌లా ఉంది’.. అంటూ కొందరు, ‘దొంగకు బాగా బుద్ధి చెప్పారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి