Snake Shocking Video: నిద్రపోతున్న వ్యక్తి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరికి చూస్తే..
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:12 PM
ఓ యువకుడు ఇంటి మేడపై నిద్రపోతున్నాడు. నేలపై పడుకుని హాయిగా నిద్రపోతున్న ఆ వ్యక్తికి.. అంతలోనే షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పొడవాటి పాము ఇంటి పైకి వెళ్లింది. చివరికి ఏమైందో చూడండి..
పాములు కలలో కనిపిస్తేనే చచ్చేంత భయం పుడుతుంటుంది. అలాంటి ఇక కళ్ల ముందు కనిపిస్తే.. ఇక ప్రాణం పోయినంత పనవుతుంటుంది. మనకు ఇలాంటి అనుభవాలు లేకపోయినా.. మన కళ్ల ముందు ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలన్నీ నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఓ పాము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంటి మేడపై పడుకుని ఉండగా.. ఓ పాము సమీపానికి దూసుకొస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఇంటి మేడపై నిద్రపోతున్నాడు. నేలపై పడుకుని హాయిగా నిద్రపోతున్న ఆ వ్యక్తికి.. అంతలోనే షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పొడవాటి పాము ఇంటి పైకి వెళ్లింది. వెళ్లీ వెళ్లగానే పడుకుని ఉన్న వ్యక్తి వైపు దూసుకెళ్లింది.
అతను గోడకు ఆనుకుని పడుకుని ఉండడంతో (snake crawled towards sleeping man) పాము అటువైపు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో అక్కడే అటూ, ఇటూ తిరుగుతూ అతడి తల వద్దే ఉంటుంది. పాము మీద పాకడంతో కాసేటికి అతడికి మెలకువ వచ్చింది. దీంతో చటుక్కున పైకి లేచాడు. పైకి లేచిన తర్వాత పామును చూసి మరింత కంగారు పడి అక్కడి నుంచి పారిపోయాడు.
చూస్తుంటే, ఇదంతా నవ్వుకోవడానికి కావాలనే చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’.. అంటూ కొందరు, ‘అది విషం లేని పాము.. ఇదంతా కావాలనే చేసినట్లుగా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 6.28 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి