Optical illusion: ఇక్కడున్న మనుషుల్లో రెండు రోబోలు కలిసిపోయాయి.. వాటిలో ఒకటి కనుక్కున్నా కూడా మీరు తోపే..
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:18 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఇంటి బయట చాలా మంది మనుషులు కనిపిస్తుంటారు. అయితే వారిలో రెండు రోబోలు కూాడా ఉన్నాయి. అవి అచ్చం మనుషుల్లాగే ఉన్నాయి. ఆ రెండు రోబోలు ఎక్కడున్నాయో కనుక్కునేేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్ని చిత్రాలు ఆసక్తితో పాటూ మన మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. వాటిలో దాగి ఉన్న పజిల్స్‌ను ఎంత ప్రయత్నించినా పరిష్కరించడం సాధ్యం కాదు. అయితే దృష్టితో పాటూ మనసును కూడా కేంద్రీకరించి పరిశీలిస్తే మాత్రం ఇట్టే కనుక్కోవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మీకోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది మనుషులు ఉన్నారు. అయితే వారిలో రెండు రోబోలు ఉన్నాయి. వాటిని కనుక్కోవడానికి ప్రయత్నించండి మరి..
సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఇంటి బయట చాలా మంది మనుషులు కనిపిస్తుంటారు. వారిలో ఓ వ్యక్తి ఆరు బయట పొయ్యి పెట్టి వంట చేస్తున్నాడు. అలాగే ఓ పాప అతను వండిన వాటి కోసం ప్లేటు పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆ పక్కనే మరో మహిళ కూర్చుని ఉంటుంది.
అలాగే కాస్త దూరంలో ఓ యువతి ఫోన్ పట్టుకుని నిలబడి ఉంటుంది. అదేవిధంగా అక్కడే పచ్చిక మైదానంపై ఓ జంట కుర్చీల్లో కూర్చుని కాఫీ తాగుతుంటుంది. చివరగా ఓ వృద్ధురాలు ఊతకర్ర సాయంతో నడుస్తూ ఇంట్లోకి వెళ్తుంటుంది. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి, మీలోని పరిశీలనా శక్తికి ఓ పరీక్ష పెడుతున్నాం. వీరిలో రెండు రోబోలు (Two hidden robots) అచ్చం మనుషుల్లాగే నటిస్తూ కలిసిపోయాయి.
ఆ రోబోలను కనుక్కోవడం అంతా ఈజీ అయితే కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇట్టే ఆ రోబోలను పసిగట్టవచ్చు. చాలా మంది ఆ రోబోలను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే వాటిని గుర్తించగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఆ రోబోలు ఏంటో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..
ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..