Crocodile VS Porcupine: ముళ్లపందితో పెట్టుకున్న మొసళ్లు.. చివరికి వాటి పరిస్థితి ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:56 PM
మొసళ్లకు బాగా ఆకలి వేయడంతో నీటి ఒడ్డుకు వచ్చాయి. ఏదైనా జంతువు కనిపిస్తే లటుక్కున లోపలికి లాగేద్దాం అని ఎదురు చూస్తున్నాయి. ఇంతలో అక్కడికి నీళ్లు తాగేందుకు ముళ్ల పంది వచ్చింది. ఇంకేముందీ.. దాన్ని చూడగానే మొసళ్లన్నింటికీ ప్రాణం లేచొచ్చింది. అన్నీ కలిసి మూకుమ్మడిగా దానిపై ఎటాక్ చేశాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..
మొసలి కంట పడిన ఏం జంతువూ తప్పించుకునే అవకాశమే లేదు. ఒక్కసారి వాటి నోట చిక్కాయంటే ఇక వాటికి ఆహారమైపోవాల్సిందే. అయితే అన్ని జంతువలు విషయంలో ఇలాగే జరుగుతుందా.. అంటే జరగదు అనే చెప్పాలి. ఎందుకంటే ఏనుగులు, నీటి ఏనుగులు, సింహాలతో పెట్టుకుని తోక ముడిచిన మొసళ్లను చాలాసార్లు చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొన్ని మొసళ్ల గుంపు ముళ్లపందిపై దాడి చేయాలని చూశాయి. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మొసళ్లకు బాగా ఆకలి వేయడంతో నీటి ఒడ్డుకు వచ్చాయి. ఏదైనా జంతువు కనిపిస్తే లటుక్కున లోపలికి లాగేద్దాం అని ఎదురు చూస్తున్నాయి. ఇంతలో అక్కడికి నీళ్లు తాగేందుకు ముళ్ల పంది వచ్చింది. ఇంకేముందీ.. దాన్ని చూడగానే మొసళ్లన్నింటికీ ప్రాణం లేచొచ్చింది. అన్నీ కలిసి (Crocodile attack on porcupine) మూకుమ్మడిగా దానిపై ఎటాక్ చేశాయి.
అయితే మొసళ్లు దాడి చేయడానికి రావడంతో ముళ్లపంది అలెర్ట్ అయింది. ‘నన్ను చంపడం అంత ఈజీ అనుకున్నారా.. రండి మీ సంగతి చెబుతా’.. అని అన్నట్లుగా, గుండ్రంతా తిరుగుతూ (Porcupine counterattack on crocodiles) వాటికి ఎదురుగా దూసుకెళ్లింది. ముళ్లతో మొసళ్లను ఎటాక్ చేసి, ఒక్కొక్క మొసలిని ముళ్లతో పొడిచి పడేసింది. దెబ్బకు అన్ని మొసళ్లకు చుక్కలు కనిపించాయి. ముళ్లపందిని వదిలేసి నొప్పి తాళలేక విలవిల్లాడిపోయాయి. ఓ మొసలి అయితే నోరు పైకి ఎత్తి అటూ, ఇటూ విదిలించుకుంటూ.. ‘చచ్చాన్రో.. దేవుడో’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.
ఈ వీడియో చూసి చాలా మంది ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేశారని అంటున్నారు. ఇది గ్రాఫిక్స్ వీడియో అయినా కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొసళ్లకు చుక్కలు చూపించిన ముళ్లపంది’.. అంటూ కొందరు, ‘ఈ ముళ్లపంది టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లు, 5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి