Share News

Train Shocking Video: కదులుతున్న రైల్లో జీవన పోరాటం.. రైలు ఎలా ఎక్కుతున్నాడో చూస్తే..

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:36 AM

సాధారణంగానే రైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనరల్ కంపార్ట్‌మెంట్‌‌లో అడుగు తీసి, అడుగు పెట్టలేని విధంగా ఉంటుంది. అయినా చాలా మంది విధి లేక ఎంత కష్టమైనా అందులోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో..

Train Shocking Video: కదులుతున్న రైల్లో జీవన పోరాటం.. రైలు ఎలా ఎక్కుతున్నాడో చూస్తే..

కొందరు తెలిసి తెలిసి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా చాలా మంది ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి తప్పులు కొన్నిసార్లు ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైలు ఎక్కుతున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. జీవన పోరాటం.. చావుతో చెలగాటం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగానే రైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనరల్ కంపార్ట్‌మెంట్‌‌లో అడుగు తీసి, అడుగు పెట్టలేని విధంగా ఉంటుంది. అయినా చాలా మంది విధి లేక ఎంత కష్టమైనా అందులోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో డోరు వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ వెళ్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


రైలు కదులుతుండగా.. ఓ వ్యక్తి రెండు రెండు బ్యాగులతో రైలు ఎక్కేందుకు వచ్చాడు. అప్పటికే రైలు బయలుదేరుతూ ఉంది. అయినా అతను ఎలాగైనా రైలును ఎక్కాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ బోగీ డోరు వద్దకు చేరుకున్నాడు. వాటిలో ఓ బ్యాగును రైల్లో ఉన్న వ్యక్తికి అందించాడు. మరో బ్యాగును చేతిలో పట్టుకుని, (man boarding train with two bags in his hands) బోగీ డోరు వద్ద నిలబడేందుకు ప్రయత్నించాడు. అడుగు పెట్టడానికి స్థలం లేకున్నా కూడా ఎలాగోలా అక్కడ అడుగేసి నిల్చున్నాడు. ఈ క్రమంలో అతడి చేతిలోని బ్యాగును ఓ వ్యక్తి అందుకోవడంతో కాస్త ఉపశమనం లభించింది.


ఆ తర్వాత కూడా అతను ఒక్కడూ అలా డోరు వద్ద వేలాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మరీ ఇంత ప్రమాదకరంగా ప్రయాణం చేయడం అవసరమా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ప్రయాణం ప్రమాదకరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లు, 3.73 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..

జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 11:37 AM