Dussehra Celebrations in Pakistan: పాకిస్తాన్‌లో హిందూ పండుగలు ఇలా చేస్తారా.. దసరా ఉత్సవాలు చూస్తే..
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:19 PM
దసరా ఉత్సవాలు మన దేశంలో మాత్రమే చేసుకుంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ మన బద్ధ శత్రువైన పాకిస్తాన్‌లో కూడా దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటారనే విషయం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో స్పష్టం చేస్తోంది..
పాకిస్తాన్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే పాక్‌లో హిందూ పండుగలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. పాక్‌లో హిందూ పండుగలు జరగవేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడ ఉండే హిందువులు.. ప్రతి పండుగను ఘనంగా జరుపుకొంటారనే విషయం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల ద్వారా అంతా కళ్లారా చూస్తున్నారు. పాకిస్తాన్‌లో వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపు తదితరాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి పాక్‌లో దసరా ఉత్సవాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ కరాచీలోని నారాయణ్‌పురా ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరిగినట్లు తెలుస్తోంది. దసరా ఉత్సవాలు (Dussehra Celebrations) మన దేశంలో మాత్రమే చేసుకుంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ మన బద్ధ శత్రువైన పాకిస్తాన్‌లో (Pakistan) కూడా దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటారనే విషయం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో స్పష్టం చేస్తోంది. నారాయణ్‌పురాలో గుజరాతీలు ఎక్కువగా ఉండడంతో ప్రతి ఏడాదీ హిందూ పండుగనలు ఘనంగా నిర్వహిస్తుంటారు.
ఈ వీడియోలో దసరా సందర్భంగా పాకిస్తాన్‌లో ప్రత్యేక వేదిక తయారు చేసి, అమ్మవారిని సర్వాంగ సుందరంగా అంలంకరించారు. అలాగే శివుడు, గణపతి తదితర దేవుళ్ల వేషధారణలో కొందరు భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోవైపు డీజే లైట్ల వెలుతురులో మహిళలు, యువతులు డాన్స్‌లు చేస్తూ సంది చేశారు. ఈ ఉత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరవడం.. అక్కడ హిందూ జనాభాను గుర్తు చేస్తోంది.
ఇలా పాకిస్తాన్‌లో కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘వావ్.. చాలా అద్భుతంగా ఉంది’.. అంటూ కొందరు, ‘భాతరదేశంలో కంటే పాక్‌లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50 వేలకు పైగా లైక్‌లు, 9.76 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోళ్ల తరహాలో తేళ్ల పెంపకం.. లీటర్ విషం ధర ఎంతో తెలిస్తే..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి