Dangerous villages: దేశంలో అత్యంత 5 ప్రమాదకరమైన గ్రామాలివే.. ఇక్కడ అడుగుపెడితే ఏమవుతుందో తెలుసా..
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:28 PM
మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రామాల్లోకి జీవించే వారు నిత్యం ప్రాణ భయంతో గడుపుతుంటారు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలీని పరిస్థితి ఉంటుంది. క్రూరమృగాలతో కొన్ని చోట్ల, దెయ్యాల భయంతో ఇంకొన్నిచోట్ల..
మన దేశంలో ఎన్నో వింతలు, విశేషాలతో కూడిన ప్రాంతాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఇదే ఇండియాలో కొన్ని ప్రాంతాలు ఎంతో ప్రమాదకరమనే విషయం చాలా మందికి తెలీదు. మరీ ముఖ్యంగా ఈ ఐదు గ్రామాలు ఎంతో ప్రమాదకరమని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ గ్రామాల్లోకి అడుగుపెడితే.. ఇక ప్రాణాలపై ఆశలు వదలుకోవాల్సిందే అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ ఆ 5 గ్రామాలు ఏంటీ, అంత ప్రమాదకర పరిస్థితులు ఏంటీ.. తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన గ్రామాలు (Dangerous Villages) కొన్ని ఉన్నాయి. ఈ గ్రామాల్లోకి జీవించే వారు నిత్యం ప్రాణ భయంతో గడుపుతుంటారు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలీని పరిస్థితి ఉంటుంది. క్రూరమృగాలతో కొన్ని చోట్ల, దెయ్యాల భయంతో ఇంకొన్నిచోట్ల, ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరికొన్నిచోట్ల జీవించడం దినదినగండంగా మారింది. ఇంతకీ ఆ గ్రామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గోసాబా గ్రామం..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సుందర్బన్స్‌లోని గోసాబా గ్రామం ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రాంతం రాయల్ బెంగాల్ పులులకు నిలయమని చెప్పొచ్చు. ఇక్కడ సుమారు 258 పులులు సంచరిస్తున్నాయని WWF నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా 50 నుంచి 100 మంది పులల దాడిలో చనిపోతున్నారట. ఇక్కడి దట్టమైన మడ అడవులు బెంగాల్ పులలకు ఆవాసంగా మారయని తెలుస్తోంది. ఈ పులులు ఆహార కోసం తరచూ గ్రామాల్లోకి చొరబడుతుంటాయి. ఈ క్రమంలో చేపలు పట్టేందుకు వెళ్లే స్థానికులు వాటి బారిన పడుతుంటారు.

షెట్‌పాల్ గ్రామం..
ప్రమాదకరమైన గ్రామాల్లో రెండో స్థానంలో బీహార్‌లోని సోన్‌పూర్ జిల్లాలోని షెట్‌పాల్ గ్రామం ఉంది. ఈ గ్రామ పరిసరాల్లో విషపూరిమైన నాగుపాములు సంచరిస్తుంటాయి. అయితే ఇక్కడి ప్రజలు వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తారట. దీంతో వారు పాములను చంపరు. ఈ గ్రామంలో ప్రతి వీధిలో నాగుపాములు కనిపిస్తుంటాయి. గ్రామస్తులు వీటిని తరిమికొట్టేందుకు మంత్రాలు జపిస్తుంటారు. పిల్లలు, రైతులు అప్పుడప్పుడూ పాముల వల్ల ప్రమాదంలో పడుతుంటారని తెలుస్తోంది. అయితే ఈ గ్రామంలోని అందరి ఇళ్లలో యాంటీ విషం అందుబాటులో ఉండడం వల్ల మరణాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయట.

మొహాలి..
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా మొహాలి గ్రామం.. ప్రమాదకరమైన గ్రామాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ గ్రామం నైరదేహి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉంటుంది. దీంతో ఈ గ్రామంలోకి రాత్రి వేళ్లలో పులులు, చిరతలు వస్తుంటాయట. పొలాల్లో పని చేసుకునే రైతులు, పాఠశాలకు వెళ్లే పిల్లలు అప్పుడప్పుడూ పులుల బారిన పడుతుంటారట. పులుల దాడులను అరికట్టేందుకు అటవీశాఖ ఈ ప్రాంతంలో వాచ్‌టవర్‌లను ఏర్పాటు చేసింది. అలాగే సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. కానీ దాడులు ఆపలేకపోతున్నాయి. పులల భయంతో స్థానికులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తుంటారట. అయినా దాడులను పూర్తి స్థాయిలో అరికట్టడం సాధ్యం కాలేదు.

గురెజ్ లోయ..
జమ్మూ కాశ్మీర్‌లోని గురెజ్ లోయలోని గ్రామాలు కూడా ప్రమాదకరమైన గ్రామాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రతి ఏటా ఇక్కడ కొండచరియలు విరిగిపడడం, భారీ వర్షాలు, భూకంపాల కరణంగా ప్రాణనష్టంతో పాటూ ఈ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతుంటాయి. దీంతో పాటూ హిమపాతాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయట. ఇక్కడ ప్రమాదాలు సంభవించిన సమయంలో సైన్యం సాయం చేస్తుంటుంది.

కుల్ధారా..
రాజస్థాన్‌లోని జైసల్మేర్ పరిధిలోని కుల్ధారా గ్రామం ఐదో స్థానంలో ఉంది. సూర్యాస్తమయం అయితే చాలు.. ఈ గ్రామంలోకి వెళ్లేందుకు అంతా జంకుతుంటారు. జాజియా పన్నుతో విసిగిపోయిన బ్రాహ్మణులు.. 1825లో కుల్ధారా గ్రామాన్ని రాత్రికి రాత్రే వదిలిపెట్టి వెళ్లిపోయారట. వారి శాపం కారణంగా ఈ గ్రామం భయంకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత ఒక్కడ ఎవరూ నివాసం ఉండలేదట. రాత్రి వేళల్లో ఈ గ్రామంలో దెయ్యాల అరుపులు, కేకలు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. దీంతో పర్యాటకులు సైతం ఈ ప్రాంతాన్ని పగటి వేళల్లో మాత్రమే సందర్శిస్తుంటారు.
ఇవి కూడా చదవండి..
కోళ్ల తరహాలో తేళ్ల పెంపకం.. లీటర్ విషం ధర ఎంతో తెలిస్తే..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి