Share News

Underwater River Metro: దేశంలో తొలి అండర్ వాటర్ రివర్ మెట్రో.. ప్రత్యేకతలు ఇవే!

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:25 PM

ప్రయాణికుల సంఖ్య, నిత్యావసరాలు పెరుగుతున్న కొద్దీ రైల్వే వ్యవస్థ నిత్యం బలపడుతూ వస్తుంది. భూమిపై రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసి, ఫ్లై ఓవర్‌లపై పరుగులు పెట్టిస్తూ నిర్మాణాలు జరిగాయి. అంతేకాకుండా వంతెనలు, నదులు, సముద్రాలపై కూడా మార్గం ఏర్పాటు చేసి రైళ్ల ప్రయాణాలు జరుగుతున్నాయి. అయితే ..

Underwater River Metro: దేశంలో తొలి అండర్ వాటర్ రివర్ మెట్రో.. ప్రత్యేకతలు ఇవే!

ప్రయాణికుల సంఖ్య, నిత్యావసరాలు పెరుగుతున్న కొద్దీ రైల్వే వ్యవస్థ నిత్యం బలపడుతూ వస్తుంది. భూమిపై రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసి, ఫ్లై ఓవర్‌లపై పరుగులు పెట్టిస్తూ నిర్మాణాలు జరిగాయి. అంతేకాకుండా వంతెనలు, నదులు, సముద్రాలపై కూడా మార్గం ఏర్పాటు చేసి రైళ్ల ప్రయాణాలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటికంటే వినూత్నంగా, అత్యంత వేగంగా వెళ్లే రైలును మన దేశంలో.. అదీ పశ్చిమ బెంగాల్‌లో నిర్మించారు. ఈ మెట్రో రైలు సామర్థ్యం, ప్రత్యేకతల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.


ఇప్పటివరకు నదులపై బ్రిడ్జి నిర్మించి ప్రయాణాలు సాగించే రైళ్లనే చూశాం. కానీ ఈ మెట్రో రైలు అన్నిటికంటే డిఫరెంట్. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగు భాగంలో నడుస్తున్న మెట్రో రైలు ఇది. కోల్‌కతా నగరంలో హూఘ్లీ నదికి అడుగున ఓ అద్భుతమైన టన్నెల్ నిర్మించి, ఆ టన్నెల్‌లో మెట్రో రైలును ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను ఎస్ప్లానేడ్ నుంచి హౌరా మైదాన్ వరకు ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి అండర్ రివర్ మెట్రో (Under River Metro) సర్వీసు ఇది. ఈ టన్నెల్ భూమి ఉపరితలం నుండి సుమారు 33 మీటర్ల లోతులో నిర్మించబడింది. హౌరా నుండి ఎస్ప్లనేడ్ వరకు మొత్తం దూరం 4.8 కిలోమీటర్ల పొడవున ఈ నిర్మాణం జరిగింది. టన్నెల్‌ను ఒక్క నిమిషంలోనే దాటేలా నిర్మించిన ఈ రైలు మార్గం.. 120 సంవత్సరాలు నిలబడేలా పటిష్టంగా నిర్మించారు.


ఈ అండర్‌వాటర్ టన్నెల్ నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పై నుండి వచ్చే నీటి ఒత్తిడిని తట్టుకుని, టన్నెల్ లోపలికి నీరు రాకుండా అడ్డుకునే యంత్రాన్ని రూపొందించాల్సి వచ్చింది. అయితే ఇలాంటి టన్నెల్ దేశంలో ఇప్పటికే నిర్మించినా.. ఈ టన్నెల్ మాత్రం నదికి క్రిందగా ఉండడంతో, సాధారణ టన్నెల్ బోరింగ్ మెషిన్‌తో ఆపరేట్ చేయడం వీలు కాలేదు. దీంతో ఈ టన్నెల్‌ను తవ్వడానికి అవసరమైన టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM)ను ప్రత్యేకంగా జర్మనీలో తయారు చేశారు. ఇది నేల తవ్వుతూ, తవ్విన వెంటనే చుట్టూ ఉండే భాగాన్ని సురక్షితంగా మూసివేయడం దీని ప్రత్యేకత. టన్నెల్లోకి నీరు ప్రవేశించకుండా.. ప్రాజెక్ట్‌కు ఎలాంటి అవరోధం కలగకుండా చూసేందుకు ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. ఈ ప్రాజెక్టులో తొలిసారిగా హైడ్రోఫిలిక్ గ్యాస్కెట్లను (Hydrophilic Gaskets) జాయింట్లలో వాడటం జరిగింది. ఇవి నీటిని తాకిన వెంటనే 10 రెట్లు పెరిగిపోతాయి.. దీంతో టన్నెల్‌లో నీరు చేరకుండా ఉంటుంది. ఈ అండర్‌వాటర్ టన్నెల్ పొడవు 520 మీటర్లు కాగా, ఎత్తు 6 మీటర్లు ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

వావ్.. పారాసిటమాల్‌తో బట్టలు ఉతకొచ్చా.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. సీతాకోకచిలుకల మధ్యన చీమను 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 08 , 2025 | 05:25 PM