Paracetamol washing: వావ్.. పారాసిటమాల్‌తో బట్టలు ఉతకొచ్చా.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:57 AM
మనదేశంలో చాలా మంది సాధారణ గృహిణులు అసాధారణ తెలివితేటలను ఉపయోగిస్తుంటారు. తమ దైనందిన జీవితంలో చేసే పనులను సులభంగా మార్చడం కోసం, శ్రమ, ఖర్చు తగ్గించడం కోసం రకరకాల ట్రిక్స్ కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మన దేశంలో చాలా మంది సాధారణ గృహిణులు అసాధారణ తెలివితేటలను ఉపయోగిస్తుంటారు. తమ దైనందిన జీవితంలో చేసే పనులను సులభంగా మార్చడం కోసం, శ్రమ, ఖర్చు తగ్గించడం కోసం రకరకాల ట్రిక్స్ కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (viral home tips).
@acharyaveda అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ పారాసిటమాల్ మాత్రతో బట్టలు ఉతికితే మరకలు సులభంగా తొలిగిపోతాయని చెబుతోంది. 'మురికిగా ఉన్న దుస్తులను శుభ్రం చేయడానికి మీకు సబ్బు లేదా డిటర్జెంట్ అవసరం లేదు. మీ బట్టలు ఎంత మురికిగా ఉన్నా, అవి పూర్తిగా పసుపు రంగులో ఉన్నా.. ఒక బకెట్ నీటిలో వాటిని వేసి పారాసెటమాల్ టాబ్లెట్ లేదా గడువు ముగిసిన టాబ్లెట్ వేసి ఉతకండి' అని సూచిస్తోంది (Paracetamol laundry hack).
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (whiten clothes with paracetamol). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి ఫన్నీ కామెంట్లు చేశారు. బట్టలు శుభ్రం చేయడానికి కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది అని ఒకరు కామెంట్ చేశారు. బట్టలు ఉతకడానికి పారాసిటమాల్ వాడితే, నాకు జ్వరం వచ్చినప్పుడు డిటర్జెంట్ ఉపయోగించాలా అని మరొకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
ఈ వాచ్‌మెన్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటే.. స్ఫూర్తివంతమైన స్టోరీ..
మీ సమర్థతకు పరీక్ష.. 78ల మధ్యనున్న 87ను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..