surprising story: ఈ వాచ్‌మెన్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటే.. స్ఫూర్తివంతమైన స్టోరీ..
ABN , Publish Date - Oct 05 , 2025 | 09:49 AM
అత్యాధునిక సాంకేతికతకు, క్రమబద్ధమైన జీవనానికి జపాన్ ఓ ప్రతీక. జపనీయుల పని సంస్కృతి కూడా ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అత్యాధునిక సాంకేతికతకు, క్రమబద్ధమైన జీవనానికి జపాన్ (Japan) ఓ ప్రతీక. జపనీయుల పని సంస్కృతి కూడా ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తి ఏడాదికి రెండు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. అయినప్పటికీ అతడు వాచ్‌మెన్‌గా తన పనిని కొనసాగిస్తున్నాడు. అతడి కథ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది (man earns 2 crore).
జపాన్‌కు చెందిన కోయిచి మత్సుబారా అనే వ్యక్తి టోక్యోలోని ఒక నివాస భవనంలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. అక్కడ అతడు వాచ్‌మెన్ డ్యూటీ మాత్రమే కాకుండా, క్లీనింగ్ కూడా చేస్తుంటాడు. ఇతడు నెలకు దాదాపు 1,00,000 యెన్లు (రూ. 60354) సంపాదిస్తాడు. ఇది టోక్యోలో సగటు నెలవారీ జీతం 3,50,000 యెన్లు (రూ. 211240) కంటే చాలా తక్కువ. అయినా అతడు చాలా శ్రద్ధగా పని చేస్తాడు. నిజానికి అతడు కోటీశ్వరుడు. అతడికి అద్దెల రూపంలోనే ఏడాదికి రెండు కోట్ల రూపాయల పైన ఆదాయం సమకూరుతుంది (viral story).
కోయిచి మత్సుబారా ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. సెకండరీ స్కూల్ పూర్తి చేసిన తర్వాత 1,80,000 యెన్‌ల జీతంతో ఓ ఫ్యాక్టరీ కార్మికుడిగా తన కెరీర్ ప్రారంభించాడు (watchman inspirational story). దాదాపు 20 సంవత్సరాల పాటు తన ఖర్చులను అదుపులో ఉంచుకున్నాడు. నామమాత్రపు ఖర్చుతో రోజులు గడిపి 30, 00, 000 యెన్‌లు పోగు చేశాడు. ఆ డబ్బుతో టోక్యో శివార్లలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు.
అప్పట్లో ఇళ్ల ధరలు పెద్దగా ఉండేవి కావు. దాంతో అదే ప్రాంతంలో మరో నాలుగు అపార్ట్‌మెంట్‌లను కూడా కొనుగోలు చేశాడు (Real life stories). ఇటీవలి కాలంలో వాటి మీద వచ్చే అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఏడాదికి అతడికి అద్దెల ద్వారానే రూ.2 కోట్లు వస్తున్నాయి. అయినప్పటికీ కోయిచి మాత్రం తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. 'నా దగ్గర సరిపడినంత డబ్బుంది. అయినా నా జీవనశైలి సాధారణంగానే ఉంటుంది. పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటానని నాకు తెలుసు' అని కోయిచి పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో మట్టి పాత్రలు ఎలా చేస్తున్నాడో చూడండి..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. చెట్టు మీద బల్లిని 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..