Creative hack: ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో మట్టి పాత్రలు ఎలా చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:47 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా క్రియేటివ్‌గా ఆలోచించి సరికొత్త పనులు చేసేవారికి సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా క్రియేటివ్‌గా ఆలోచించి సరికొత్త పనులు చేసేవారికి సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (creative pottery hack).
aapkaculture అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి పాత వాషింగ్ మెషిన్ ముందు కూర్చున్నాడు. ఆ వాషింగ్ మెషిన్ బాడీని తొలగించడంతో మోటార్ కనబడుతోంది. గుండ్రంగా తిరుగుతున్న ఆ మోటార్ సహాయంతో ఆ వ్యక్తి మట్టి దీపాలను సునాయాసంగా చేసేస్తున్నాడు. త్వరలోనే దీపావళి రాబోతోంది. దీంతో ఈ సూపర్ టెక్నాలజీతో ఆ వ్యక్తి సునాయాసంగా మట్టి దీపాలు తయారు చేస్తున్నాడు (washing machine clay pot).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Indian viral news). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు. 55 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంజినీర్ కుండలు చేసే వ్యక్తి అని ఒకరు కామెంట్ చేశారు. ఇతని తెలివికి జోహార్లు అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి