Train Accident Video: రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.. తీరా చూస్తే షాకింగ్ సీన్..
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:02 PM
ఓ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతోంది. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో గిటార్ పట్టుకుని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పటికే రైలు ముందుకు కదులుతోంది. అయినా ఆ వ్యక్తి ఎలాగైనా ఆ రైలును ఎక్కాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే..
రైలు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. రైలు ప్రయాణ సమయాల్లో కొందరు తెలిసి తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. మరికొదరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు మిరాకిల్ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతోంది. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో గిటార్ పట్టుకుని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పటికే రైలు ముందుకు కదులుతోంది. అయినా ఆ వ్యక్తి ఎలాగైనా ఆ రైలును ఎక్కాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే తీరా రైలు ఎక్కే సమయంలో అదుపు తప్పి, ధబేల్‌మని రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోయాడు.
అతను కింద పడిపోవడంతో (Man falls in middle of train and platform) అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతను ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అంతా అనుకున్నారు. రైల్లో ఉన్న వారు కంగారుపడి చైన్ లాగి ట్రైన్‌ను ఆపేశారు. తీరా రైలు ఆగిన తర్వాత చూడగా.. కిందపడ్డ వ్యక్తి తాపీగా పైకి లేచి, ప్లాట్‌ఫామ్ పైకి వచ్చేశాడు. ఇదంతా ఒక ఎత్తైతే.. అతను పడిపోయిన సమయంలో ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉన్నాడు.
అయితే పడిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఫోన్ వీడియో తీయడం మాత్రం ఆపలేదు. కిందపడిన తర్వాత కూడా మొత్తం రికార్డ్ చేశాడు. ఈ ఘటనలో అతను స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కెమెరామెన్‌కు ఎప్పటికీ చావు ఉండదు’.. అంటూ కొందరు, ‘ఆ రోజు యమరాజ్ లీవ్‌లో ఉన్నట్లుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2100కి పైగా లైక్‌లు, 1.89 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోళ్ల తరహాలో తేళ్ల పెంపకం.. లీటర్ విషం ధర ఎంతో తెలిస్తే..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి