Metro Viral Video: టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..
ABN , Publish Date - Oct 16 , 2025 | 08:49 AM
ఓ వికలాంగుడు అందరితో పాటే టికెట్ కొని మెట్రో రైలు ఎక్కేశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. టికెట్ కొని రైలు ఎక్కిన అతను.. ఆ తర్వాత చేసిన పనికి అంతా అవాక్కయ్యారు..
మెట్రో రైళ్లలో ప్రయాణికుల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువకులతో పాటూ యువతులు కూడా మెట్రో రైళ్లలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. కొందరు అమ్మాయిలు ఉన్నట్టుండి ప్రయాణికుల మధ్యలో డాన్సులు, విచిత్ర విన్యాసాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు మరీ వింతగా విచిత్రగా ప్రవర్తిస్తూ అందరికీ చిరాకు తెప్పిస్తుంటారు. అయితే తాజాగా ఓ వికలాంగుడు మెట్రో రైల్లో చేసిన నిర్వాకం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరు (Bangalore) సంపిగే రోడ్, శ్రీరాంపుర స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. ఓ వికలాంగుడు అందరితో పాటే టికెట్ కొని మెట్రో రైలు ఎక్కేశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. టికెట్ కొని రైలు ఎక్కిన అతను.. ఆ తర్వాత ఒక్కసారిగా బెగ్గర్‌గా మారిపోయాడు. కుంటుతూ నడుస్తూ సీట్లలో కూర్చొన్న వారి వద్దకు వెళ్లి డబ్బులు అడుక్కున్నాడు.
అయితే అక్కడున్న వారిలో ఎవరూ అతడికి డబ్బులు ఇవ్వడానికి ఆసక్తిచూపలేదు. అయినా ఆ వ్యక్తి బోగీలో (Disabled man begging in metro train) అందరినీ అలా అడుక్కుంటూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత రైల్వే సెక్యూరిటీ సిబ్బంది అటుగా వస్తారు. వారు నేరుగా ఆ భిక్షగాడి వైపు వెళ్లడం వీడియోలో చూడొచ్చు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఆ భిక్షగాడు దాసరహల్లి స్టేషన్‌లో దిగిపోయినట్లు తెలిసింది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎవరూ అతడికి డబ్బులు ఇవ్వకపోవడం దారుణం’.. అంటూ కొందరు, ‘మెట్రో రైళ్లలో ఇలా చేయడం తగదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.. తీరా చూస్తే షాకింగ్ సీన్..
దేశంలో అత్యంత 5 ప్రమాదకరమైన గ్రామాలివే.. ఇక్కడ అడుగుపెడితే ఏమవుతుందో తెలుసా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి