Crocodile Attack Video: మొసలి వ్యూహాన్ని ఎప్పుడైనా చూశారా.. జింకను ఎలా వేటాడిందంటే..
ABN , Publish Date - Oct 08 , 2025 | 08:34 PM
మొసళ్లు ఎలా వేటాడతాయో అంతా చూస్తూనే ఉంటాం. నీళ్లు తాగడానికి జంతువు రాగానే.. లటుక్కున నోట కరుచుకుని నీటిలోకి లాగేసుకుంటుంటాయి. అయితే తాజాగా, ఎంతో తెలివిగా వేటాడిన మొసలిని చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఒక్కో జంతువు వేట పద్ధతి ఒక్కోలా ఉంటుంది. పులి, సింహాలు కొన్నిసార్లు నక్కి నక్కి వేటాడితే.. మరికొన్ని సార్లు వెంటపడి మీర వేటాడుతుంటాయి. అలాగే పిల్లులు, కుక్కలు సైలెంట్‌గా దాక్కుని మరీ కోళ్లను వేటాడుతుంటాయి. ఇక స్పైడన్ వంటి జీవులు.. పద్మవ్యూహం తరహాలో ఉచ్చును తయారు చేసి వేటాడతాయనే విషయం తెలిసిందే. ఇలాంటి వినూత్న వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, మొసలి వేట వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జింకను వేటాడిన మొలసిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. మొసలి వ్యూహం మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మొసళ్లు ఎలా వేటాడతాయో అంతా చూస్తూనే ఉంటాం. నీళ్లు తాగడానికి జంతువు రాగానే.. లటుక్కున నోట కరుచుకుని నీటిలోకి లాగేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు మొసళ్లు.. ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. నీటి ఒడ్డున బురదలో కలిసిపోయి.. గంటల తరబడి కదలకుండా ఉంటూ జంతువు సమీపానికి రాగానే తమ విశ్వరూపం చూపిస్తుంటాయి.
ఇలాంటి తెలివైన వేటకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆకలితో ఉన్న మొసలి.. నీటి ఒడ్డున ఉన్న బురద, ఆకుల మధ్యలోకి చేరుకుంది. పూర్తిగా అందులో కలిసిపోయి, (Crocodile hiding in mud and leaves) బయటికి కనిపించకుండా దాక్కుంది. ఇదేమీ గమనించిన జింకలు.. నీళ్లు తాగేందుకు అక్కడికి వచ్చాయి. జింకలు లోపలికి దిగి మరీ నీళ్లు తాగుతుండగా.. మొసలి ఒక్కసారిగా నీటిలో నుంచి పైకి లేచి వాటిపై దాడికి దిగింది. వాటిలో ఒక జింకను నోట కరుచుకుని నీటిలోకి లాగేసుకుంది.
ఇలా చాలా సేపు బురద, ఆకుల మధ్యలో దాక్కున్న మొసలి.. (Crocodile hunting deer) ఎంతో తెలివిగా జింకను వేటాడిందన్నమాట. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. మొసలి ఇలా ఎంతో తెలివిగా వేటాడడాన్ని ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ కొందరు, ‘మొసలి వేట మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 వేలకు పైగా లైక్‌లు, 6.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.. తీరా చూస్తే షాకింగ్ సీన్..
దేశంలో అత్యంత 5 ప్రమాదకరమైన గ్రామాలివే.. ఇక్కడ అడుగుపెడితే ఏమవుతుందో తెలుసా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి